Vijay Deverakonda on marriage: విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ మూవీ సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఖుషిలో సమంత హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం నుంచి లేటెస్ట్‌గా ‘ఆరాధ్య’ సాంగ్ రిలీజ్ చేశారు. లవ్ సాంగ్స్ కావడంతో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ సాంగ్ రిలీజ్ కాకముందు విజయ్ దేవరకొండ తన మనసులో మాట బయటపెట్టాడు. ఆరాధ్య సాంగ్ తనకు బాగా నచ్చిందని, పెళ్లి తర్వాత ఎలా ఉండాలో ఈ పాటలో ఉందన్నారు. తనకు వివాహం అయ్యాక ఈ పాటలో చూపించినట్లుగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. (Vijay Deverakonda on marriage)
సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి.. ఇలా విజయ్ ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఖుషి మూవీ నేపథ్యంలో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. “ఖుషి”లో తనకు ఇష్టమైన పాటల్లో ‘ఆరాధ్య..’ ఒకటని రౌడీ బాయ్ పేర్కొన్నాడు. వివాహం చేసుకున్న తర్వాత సంవత్సరం పాటు జంట ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారని చెప్పాడు. ఎంతో అద్భుతంగా సాగే ఈ పాటలో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని బ్యూటిఫుల్‌గా తెరకెక్కించినట్లు వివరించాడు.
Read Also : Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ జోరు.. రెమ్యునరేషన్ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ
తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని, ఫ్యూచర్‌లో తన వైవాహిక జీవితం ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని ఆశిస్తున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పాడు. ఇక ఖుషి మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ సరసన సమంత (Samantha) నటిస్తోంది. ఈ మూవీ నుంచి మొదట వచ్చిన ‘నా రోజా నువ్వే..’ సాంగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో, రీల్స్‌లో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తోంది. సూపర్ హిట్ అయ్యి ట్రెండింగ్‌లో నిలిచింది.
కొన్నాళ్ల కిందట స్టార్ హీరోయిన్ రష్మిక మంధాన (Rashmika Mandanna)తో విజయ్ దేవరకొండ ప్రేమాయణంలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. మొన్నామధ్య డిన్నర్ డేట్స్, హాలిడే వెకేషన్లకు ఇద్దరూ వెళ్లి వచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జోరుగా పుకార్లు వచ్చాయి. మాల్దీవులకు ఇద్దరూ వెళ్లి రిలాక్స్ అయి వచ్చారనే ప్రచారం జరిగింది. ఇద్దరూ ఫొటోలు కూడా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే దానికి ఆజ్యం పోసినట్లయింది.
అయితే, తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము మంచి స్నేహితులం మాత్రమేనంటూ అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక పలుమార్లు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ పెళ్లి ప్రస్తావన తేవడంతో రష్మికతో ప్రేమాయణం మ్యాటర్ మరోసారి చర్చనీయాంశమైంది.
Read Also : Vijay Deverakonda Kushi: ఖుషి సెకండ్ సింగిల్ కమింగ్ సూన్.. సెప్టెంబర్ 1న మూవీ గ్రాండ్ రిలీజ్!