Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా.. (Tamannaah Bhatia) తన నటనా చాతుర్యంతో అనేక సినిమాల్లో నటించి రాణిస్తోంది. టాలీవుడ్లో తనదైన ముద్ర వేసింది. చలాకీ నటిగా గుర్తింపు పొందిన తమన్నా.. అందంతో పాటు నటన, డ్యాన్స్లతోనూ ప్రేక్షకులను మైమరపించేస్తోంది. ప్రెసెంట్ దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ వరుసగా మూవీలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల మదిలో తమన్నా చిరస్థాయిలో నిలిచిపోయేలా నటనతో ఆకట్టుకుంటోంది.
ఈ మధ్య వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ సందడి చేస్తోంది తమన్నా భాటియా. కొన్నాళ్లుగా బాలీవుడ్ (Bollywood Hero) కథానాయకుడు విజయ్ వర్మతో ఈ ముద్దు గుమ్మ రిలేషన్ కొనసాగిస్తోంది. ఈ మేరకు అనేక వార్తలు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు స్పందించని తమన్నా.. తాజాగా ఆయా వార్తలపై రియాక్షన్ ఇచ్చింది. ఆ వార్తలు నిజమేనంటూ బాంబ్ లాంటి న్యూస్ బయటకు చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిల్కీ బ్యూటీ.. దీనిపై స్పందించింది. విజయ్ వర్మతో రిలేషన్ (Relation) నిజమేనని స్పష్టం చేసింది.

ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది..
విజయ్ వర్మ (Vijay Varma) తనపై ఎంతో శ్రద్ధ చూపుతాడని ఇంటర్వ్యూ సందర్భంగా తమన్నా పేర్కొనడం గమనార్హం. అతడితో ఉంటే సంతోషంగా ఉంటానని తమన్నా వెల్లడించింది. తాను విజయ్ వర్మతో ఎంతో చనువుగా ఉంటున్నానంటే అందుకు కారణం అతడు కేవలం నా సహ నటుడు మాత్రమే కాదని, తమ ఇద్దరి నడుమ మంచి బంధం ఉందని వెల్లడించింది తమన్నా. సాధారణంగా ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో మనం సంతోషంగా ఉంటామనే భావన కలిగించాల్సి ఉంటుందని తమన్నా పేర్కొంది. విజయ్ వర్మతో ఉంటే తనకు అలానే ఉంటుందని తెలిపింది.
తాను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించానని, వాళ్లందరి కంటే విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. విజయ్ తనను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, కష్టం వస్తే తనతోనే ఉంటాడనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించింది. ఏ రంగంలోనైనా ముఖ్యంగా సినీ పరిశ్రమలో మనం ఎదుగుతున్నామంటే కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారని, విజయ్ అలాంటి వాళ్లనుంచి నన్ను రక్షిస్తాడని దీమా వ్యక్తం చేసింది ఈ బ్యూటీ.

ఇక తన కోసం తను ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నట్లు తమన్నా తెలిపింది. అందులోకి తనను తానుగా అర్థం చేసుకొనే విజయ్ వర్మ వచ్చాడని క్లారిటీ ఇచ్చింది. అతడు తనపై ఎంతో శ్రద్ధ వహిస్తాడని సంబరపడిపోయింది. విజయ్ ఎక్కడ ఉంటే అక్కడే తన సంతోషం ఉందని, తమ ఇద్దరి మధ్య మంచి ఆర్గానిక్ బంధం ఉందంటూ కామెంట్స్ చేసింది తమన్నా. ‘లస్ట్ స్టోరీస్2’ సెట్స్లోనే వాళ్లిద్దరి మధ్య బంధం మొదలైనట్లు తమన్నా క్లారిటీ ఇచ్చింది. దీంతో నెటిజన్లంతా ఈ ప్రేమజంటకు శుభాకాంక్షలు వెల్లువలా చెబుతున్నారు.

తమన్నా త్వరలోనే హైదరాబాదీ కోడలు కానుందంటూ కామెంట్లు హోరెత్తిస్తున్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘లస్ట్ స్టోరీస్2’ (Lust Stories 2) ఈనెల 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందంటూ రూమర్స్ వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ తమ రిలేషన్ నిజమేనని తమన్నా క్లారిటీ ఇచ్చేయడంతో ఇక గాసిప్లకు తెరపడింది.
Read Also : Weight Gain Tips for Women: అమ్మాయిలూ.. వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలా చేయండి..!






