Mrunal Thakur: యువ కథానాయిక మృణాల్ ఠాకూర్ జోరుమీదుంది. తెలుగులో సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఓ మంచి అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కి హిట్ కొట్టింది. ఈ మూవీలో పద్ధతిగా మంచి నటన చేసిన మృణాల్.. అందరినీ కట్టిపడేసింది. ఆ మూవీ సంచలన విజయం సాధించడంతో మృణాల్‌కు వరుసగా సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. (Mrunal Thakur)
ఇక బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. అర్జున్ రెడ్డి మూవీకి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. స్టార్ హీరోలందరూ మృణాల్ ను హీరోయిన్ గా కావాలంటున్నారట. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాలో మృణాల్ కథానాయికగా ఎంపికైంది.
మరోవైపు దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న నయా మూవీలోనూ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ అవకాశం దక్కించుకుంది. వరుస అవకాశాలు క్యూ కడుతుండటంతో మృణాల్ ఠాకూర్ తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
నిన్నమొన్నటి దాకా లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు కోట్లకు పెంచేసిందట. ఒక సినిమాకు మృణాల్ రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టాక్. మరోవైపు తమిళ ఇండస్ట్రీలోనూ ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. దీంతో ఆటోమేటిగ్గా రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తోందట.
మృణాల్ ఠాకూర్ సైమా వేడుకల కోసం దుబాయ్ టూర్ వెళ్లింది. సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో వేడుకగా సాగనుంది. సైమా ఈవెంట్ ప్రకటన కార్యక్రమంలో రానా దగ్గుబాటి, మృణాల్ ఠాకూర్ పార్టిసిపేట్ చేశారు. కోట్ అండ్ ప్యాంట్స్ ధరించిన మృణాల్ సూపర్ స్టైలిష్ పోజుల్లో అదరగొట్టింది.
Read Also : Vijay Deverakonda Kushi: ఖుషి సెకండ్ సింగిల్ కమింగ్ సూన్.. సెప్టెంబర్ 1న మూవీ గ్రాండ్ రిలీజ్!
“we all want to work with her.. she is very busy like there's no more easy dates are available for the next year and half or more”
— Rana Daggubati 😄❤️[#MrunalThakur #Nani30 #VD13] pic.twitter.com/GXacpChwuG
— y. (@yaaro__oruvan) July 7, 2023
మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యింది. మరాఠీ చిత్రం విట్టి దండుతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రి ఇచ్చింది. మృణాల్ కి హిందీ మూవీ లవ్ సోనియా బ్రేక్ ఇచ్చింది. అనంతరం సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులారిటీ పొందింది.
ప్రేమ, పెళ్లిపై మృణాల్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. థర్టీ ప్లస్ లో ప్రేమ వ్యవహారాలు ఒత్తిడికి గురి చేస్తాయని చెబుతోంది. ఇక పిల్లలను పొందాలనే ఆశ ఉందని, కానీ పెళ్లి చేసుకోనని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రోజుల్లో పిల్లల కోసం పెళ్లి తప్పని సరి కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది మృణాల్.
Read Also : Lust Stories 2: మరోసారి తమన్నా బోల్డ్ యాక్టింగ్.. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్‌లో విజయ్ వర్మతో రొమాన్స్!