Lust Stories 2: లస్ట్ స్టోరీస్ రెండో సీజన్ ఈనెల 29వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ వెబ్ సిరీస్‌కు చెందిన ట్రైలర్ విడుదల చేశారు. 2018లో రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందిన ఈ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌కు ప్రస్తుతం కొనసాగింపుగా రెండో సీజన్ ప్రసారం కానుంది. తాజాగా సీజన్2కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయడంతో కుర్రాళ్లు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ సీజన్‌లో తమన్నా భాటియా (Tamannaah), విజయ్ వర్మ, మృణాల్ థాకూర్ (Mrunal Thakur), సీనియర్ హీరోయిన్ కాజోల్ (Kajol) ప్రత్యేక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే మరో వెబ్ సిరీస్ జీ కర్దా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అందులో తమన్నా బోల్డ్ సీన్లలో నటించి హీట్ పుట్టించింది. టాప్‌లెస్‌గా నటించి రొమాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. బోల్డ్ సీన్లలో తమన్నాను చూసేసరికి యువత ఎగబడిపోయి చూశారు. ఎక్కడ చూసినా ఈ టాపిక్ చర్చనీయాంశమైంది. అయితే ఈ బోల్డ్ సీన్ల వ్యవహారంపై తమన్నా స్వయంగా స్పందించింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న డిష్కషన్‌పై రియాక్ట్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. ఈ వార్తలపై స్పందిస్తూ రిప్లయ్ ఇచ్చింది.
ఈ సిరీస్ లో పాత్ర డిమాండ్ చేయడం కారణంగానే తాను బోల్డ్‌గా నటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది తమన్నా. ఈ సిరీస్ కు బోల్డ్ సీన్స్ చాలా అవసరమని తెలిపింది. ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ ను సహజంగా చూపించే ప్రయత్నంలోనే దర్శకుడు ఈ రకంగా తెరకు ఎక్కించాడని వివరించింది. ఈ సీన్స్ నచ్చినా నచ్చకపోయినా కథలో భాగంగానే చూడాలని తమన్నా ప్యాన్స్ కు సూచనలు చేసింది. ఈ రకంగా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలకైనా సిద్ధమనే సంకేతాలను ఇచ్చింది తమన్నా. తమన్నా విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
జీ కర్దా వెబ్ సిరీస్‌లో ఎన్నడూ లేనంతగా బోల్డ్ సన్నివేశాల్లో నటించి తమన్నా అట్రాక్ట్ చేసిన సంగతి మరువక ముందే లస్ట్ స్టోరీస్ 2లోనూ కాస్త బొద్దుగా బోల్డ్‌గా నటించింది తమన్నా. దీంతో అవకాశాలు సన్నగిల్లడంతోనే తమన్నా ఇలా బోల్డ్ క్యారెక్టర్లు చేస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) ట్రైలర్‌లోనూ తమన్నా క్యారెక్టర్ ప్రత్యేకంగా చూపించారు. రియల్ లైఫ్‌లోనూ విజయ్ వర్మతో లవ్ ట్రాక్‌లో ఉన్న తమన్నా.. వెబ్ సిరీస్‌లో నటించడానికి బదులుగా జీవించేసిందనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇందులో ఓ ట్విస్ట్ చూపించారు. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నాకు మరో వ్యక్తితో పెళ్లి జరిగి ఉంటుంది. ఆమెతో విజయ్ వర్మ వివాహేతర బంధం పెట్టుకున్నట్లుగా చూపించడం గమనార్హం.
ఇలాంటి వెబ్ సిరీస్‌లు, సీన్లతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వెబ్ సిరీస్‌లు కాపురాల్లో చిచ్చురేపి అక్రమ సంబంధాలను ప్రోత్సహించేలా చేస్తాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. అయితే, నేటి యువతకు ఇలాంటి సీన్లు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటాయనే కోణంలో మేకర్స్ తీస్తున్నారనేది మరో వాదన. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ మీరు కూడా చూసేయండి మరి..
Read Also : Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్ హావభావాలు.. వీడియో క్లిప్స్ వైరల్!