HomeLife StyleGanji for Health: రోజుకో గ్లాసు గంజి తాగితే శరీరంలో ఆశ్చర్యపరిచే మార్పులు..!

Ganji for Health: రోజుకో గ్లాసు గంజి తాగితే శరీరంలో ఆశ్చర్యపరిచే మార్పులు..!

Ganji for Health: పూర్వ కాలంలో గంజి తాగి బతికేవారని వినేవాళ్లం. మన తాత ముత్తాతలు కూడా రోజూ గంజి తాగేవారు. అందుకే పెద్దలు అంత ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. ఆయుర్వేదంలో కూడా గంజికి ఉన్నత స్థానం ఉంది. కానీ ఇప్పుడు గంజి తాగే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గ్రామాల్లో కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. అన్నం వండుకునే పద్ధతుల్లో వేగంగా మార్పు రావడంతో గంజి దొరికే పరిస్థితి ఉండటం లేదు. Ganji for Health

ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ కుక్కర్లో, వంటలు రావడంతో గంజి అడ్రస్‌ గల్లంతయ్యింది. గంజి వచ్చేలా అన్నాన్ని ప్రత్యేకంగా వండుకోవాల్సి ఉంటుంది. గంజిలో ప్రోటీన్లు క్యాల్షియం, డైటరీ ఫైబర్, జింక్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి అధికంగా ఉంటాయి. ప్రతిరోజు గ్లాసు గంజిని తాగితే చాలు.. మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుందని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు చక్కటి మేనిఛాయ కూడా మీ సొంతం అవుతుందట.

గుండెకు పరమౌషధం..
ప్రతి రోజూ వ్యాయామాలు చేయడానికి ఇష్టపడేవారు ప్రోటీన్ షేక్ కన్నా గ్లాసు గంజిని తాగితే బెటరని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని దృఢంగా మారుస్తుందని సూచిస్తున్నారు. కండలు పెరిగేలా చేస్తుందని, ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభించేలా చేస్తుందట.

అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ గంజిని తాగాలి. దీనిలో ఉండే ఫైబర్లు, ఫైటో కెమికల్స్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును అదుపులో ఉంచేలా చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు కూడా మంచిది. గుండె సమస్యలు, గుండెపోటు వంటివి దరిచేరవు.

విరేచనాలతో ఇబ్బంది పడుతున్న వారు, వాంతులు వల్ల అనారోగ్యం పాలవుతున్న వారు ప్రతిరోజూ గంజిని తాగాలి. ఇది విరేచనాల వల్ల కలిగే నీరసం నుంచి వేగంగా ఉపశమనం కలిగిస్తుంది. శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి అందిస్తుంది. గంజి తాగడం వల్ల శారీరాక ప్రశాంతతే కాదు, మానసిక ప్రశాంతత సైతం దక్కుతుంది. గంజిలో ఉండే ఉండే ఖనిజ లవణాలు కడుపులో మంట, నొప్పి రాకుండా చేస్తాయి. జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేసే వీలుంది. మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

హెయిర్‌ ఫాల్‌కూ పరిష్కారం
చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలనుకునేవారు ప్రతిరోజూ గంజిని తాగాలి. ఈ విషయం ఆయుర్వేదంలో సైతం ఉంది. బియ్యంతో తయారైన గంజిలో ఇనోసెటాల్ ఎక్కువ ఉంటుంది. గంజిని తాగినప్పుడు ఇది కూడా మన శరీరంలో వెళ్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాదు, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు చర్మం మెరుపు సంతరించుకోవాలంటే రోజూ గంజి తాగాలి.

గంజిని ఎలా వండుకోవాలంటే..
గంజి వచ్చేలా అన్నం వండాలంటే ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్‌ వేయాలి. అన్నం ఉడికిపోయాక గంజి నీళ్లు పైకి తేలుతూ ఉంటాయి. ఆ గంజి నీళ్లను వార్చుకుని వేరు చేయాలి. అన్నాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ గంజి చల్లారాక అందులో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే భలే రుచిగా ఉంటుంది. కొందరు పంచదార వేసుకుని తాగుతుంటారు.

గంజి చల్లారాక అందులో అన్నం తీసుకొని… సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పును కలిపి తింటే రుచి అదిరిపోవాల్సిందే. దీంతోపాటు కాదు శరీరానికి ఎంతో బలం లభించేలా చేస్తుంది. రాత్రిపూట ఇలా తయారు చేసుకుని ఉదయం పులిశాక ఆ అన్నాన్ని తింటే ఎలాంటి రోగాలూ మీ వద్దకు రావు. శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది.

ఇవీ చదవండి: Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
Peas: వేయించిన శనగలు.. మితంగా తీసుకుంటే రుచి, ఆరోగ్యం.. ప్రోటీన్స్ సమ్మిళితం
Early morning Tea: ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎంతటి నష్టమో తెలుసా?
Egg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..
Pasupu Kommulu: పసుపు కొమ్ముల ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో తెలుసా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు