BJP First List: సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 195 మంది పేర్లను వెల్లడించింది. ఎన్డీఏకు 400 సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వినోద్ తావదే తెలిపారు. బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 195 సీట్లపై నిర్ణయం తీసుకున్నామన్నారు.
వారణాసి నుంచి ప్రధాని మోదీ మరోసారి పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. తొలిజాబితాలో 28 మంది మహిళలకు చోటు దక్కింది. యువతకు 47 స్థానాలు, ఎస్సీ 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు వినోద్ తావదే తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు ఉన్నారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రుల పేర్లు కనిపించాయి. తెలంగాణ నుంచి 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
* వారణాసి నుంచి ప్రధాని మోదీ మరోసారి పోటీ
* గాంధీనగర్ నుంచి అమిత్ షా
* దిబ్రూఘర్ నుంచి శర్వానంద్ సోనోవాల్
* అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు
* ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారి
* రాజ్ కోట్ నుంచి పురుషోత్తం రూపాలా
* పోర్ బందర్ – మాన్సుక్ మాండవీయ
* ఉదంపూర్ – జితేంద్రసింగ్
* గొడ్డా – నిషికాంత్ దూబే
* కుంటి – అర్జున్ ముండా
* త్రిస్సూర్ – సురేష్ గోపి
* పథనం తిట్ట – అనిల్ ఆంటోనీ
* గుణ – జ్యోతిరాధిత్య సింధియా
* విదిశా – శివరాజ్ సింగ్ చౌహాన్
* బికనూర్ – అర్జున్ రామ్ మేఘ్వాల్
* జోథ్ పూర్ – గజేంద్రసింగ్ షెకావత్
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు
* సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
* కరీంనగర్ – బండి సంజయ్
* నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
* మల్కాజ్ గిరి – ఈటల రాజేందర్
* భువనగిరి – బూర నర్సయ్యగౌడ్
* హైదరాబాద్ – మాధవీలత
* చేవెళ్ల – కొండా విశ్వేశ్వరరెడ్డి
* నాగర్ కర్నూల్ – పి.భరత్ గౌడ్
* జహీరాబాద్ – బీబీ పాటిల్
ఏపీ నేతలతో అధిష్టానం భేటీ..
14 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో శివప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఇవాళ 11 పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ కానున్నారు. తాము కోరుకుంటున్న స్థానాలేవి అనే అంశాన్ని పలువురు నేతలు ప్రస్తావించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు, నరసరావు పేట, ఎన్టీఆర్ జిల్లాల్లోని ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. బలోపేతం పైనే చర్చించామంటూ పార్టీ నేతలు పైకి చెబుతున్నప్పటికీ టికెట్ల విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆశావహుల జాబితాను జాతీయ నాయకత్వానికి అందించామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. పొత్తులపై అధిష్టానానిదే ఫైనల్ అని చెబుతున్నారు.
ఏపీలో అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
తొలి జాబితాలో ఏపీ నేతల పేర్లు కనిపించలేదు. పొత్తు చర్చలు కొనసాగుతుండడంతో ఏపీ జోలికెళ్లకపోవడం గమనార్హం. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: CM Jagan with Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులపై చర్చ
Modi new year wishes: నాటు.. నాటు.. పాటకు ఆస్కార్ అవార్డుతో దేశం ఉర్రూతలూగింది.. ప్రధాని మోదీ న్యూ ఇయర్ విషెస్
Modi Youtube Channel: 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు.. దూసుకెళ్తున్న ప్రధాని మోదీ యూట్యూబ్ చానల్
PM Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi in Telangana: తెలంగాణలో అవినీతిరహిత పాలన కావాలి.. ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ
