CM Jagan Help to Doctor Couple: కోవిడ్ కష్టకాలంలో ఏ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చిందో దాన్ని ఫేస్ చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి కష్టకాలంలో ప్రభుత్వం తమ ప్రాణాలు నిలబెడితే దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాంటి బాధితుల్లో ఒకరి కథే ఈ కథనం. CM Jagan Help to Doctor Couple
ఈమె పేరు డాక్టర్ భాగ్యలక్ష్మి. గుంటూరు మెడికల్ కాలేజీలో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. తన భర్త డాక్టర్ ఎన్.భాస్కర్. నల్లపాడు రీజనరల్ ట్రైనింగ్ సెంటర్‌లో పని చేస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో కోవిడ్ మహమ్మారి కొట్టిన దెబ్బ జీవితాల్ని తలకిందులు చేసింది.
కానీ, సీఎం జగన్ అమలు చేస్తున్న డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ వీరి జీవితాల్లో వెలుగులు నింపింది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిండు ప్రాణాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ జంట చెబుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీరి గాధ.. డాక్టర్ భాగ్యలక్ష్మి మాటల్లోనే..
’’ఆయన డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ రెసిపీయెంట్. కోవిడ్ మహమ్మారి అందరినీ ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. 2020-21 సమయంలో కారంచేడు పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేశారు. నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వచ్చాను. ఇద్దరం కోవిడ్ కష్టకాలంలో పని చేస్తున్నాం.
ఆ సమయంలో ఎలా ఉండేదంటే.. మేము కష్టపడి చదువుకున్నాం. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాం. కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచం సెటిల్డ్‌గా ఫీలవుతున్నాం. మిడిల్ క్లాస్ వాళ్లందరూ ఒక సొంతిల్లు కావాలనుకుంటారు. సేవింగ్స్‌తో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పనికొస్తాయని రూ.5 లక్షలు సేవింగ్స్ పెట్టుకున్నాం. చాలా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఫీలవుతున్న సమయం అది.
అయితే, కోవిడ్ రెండో వేవ్ మా జీవితాలను తలకిందులు చేస్తుందని మాకు అప్పుడు తెలియలేదు. ఏప్రిల్ చివరి వారంలో మేమిద్దరం కోవిడ్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కోవిడ్‌కు గురయ్యాం. అందరిలాగే మేము కూడా హోం ఐసొలేషన్‌లో ఉన్నాం. కావాల్సిన ప్రికాషన్స్, మెడిసిన్స్ తీసుకుంటున్నాం.
4వ రోజు మేము సి.టి. స్కాన్ కోసం వెళ్లారు. ఇందులో భాస్కర్ లంగ్స్ దాదాపు 50 శాతంపైనే ప్రభావితం అయినట్లు తేలింది. వెంటనే సంబంధిత ఇంజెక్షన్లు తీసుకున్నాం. జీజీహెచ్‌లోనే చేరాం. తన శాచురేషన్ లెవల్స్ తగ్గిపోతున్నాయి. చికిత్సకు పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత వేర్వేరు కార్పొరేట్ ఆస్పత్రులకు మారుతూ వచ్చాం. 4 ఆస్పత్రులకు తిరిగాం. అయినప్పటికీ ప్రోగ్రెసివ్‌గా లంగ్స్ డ్యామేజీ అవుతున్నాయి.
తన లంగ్స్ రెండూ పూర్తిగా పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్‌కు గురయ్యాయి. చివరగా లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని చెప్పారు. ఈ ప్రాసెస్ అంతట్లో మేము దాచుకున్న రూ.5 లక్షలు ఒక వారం కూడా చికిత్స ఖర్చుకు సరిపోలేదు. 2001లో మాతోపాటు చదువుకున్న వాళ్లంతా మా క్లాస్‌మేట్స్ తలోకొంత కంట్రిబ్యూట్ చేశారు. తర్వాత మేము పని చేసిన ప్రదేశాల్లో, మా గురించి తెలిసిన వాళ్లు, డాక్టర్స్, అందరూ సాయం చేశారు. కానీ ఆ ట్రీట్‌మెంట్ పూర్తిగా తీసుకొనేందుకు ఈ సొమ్ము సరిపోలేదు.
చివరకు మా శ్రేయోభిలాషులు చెప్పిందేంటంటే.. ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వండి.. కచ్చితంగా మీకు సాయం దొరుకుతుందని చెప్పారు. అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అప్రోచ్ అయ్యాము. ఆయన మా విషయం అంతా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం గారు ఇమ్మీడియట్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు.
చనిపోయే పరిస్థితి రాకూడదు..
ఇంత కష్టపడి హానెస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్లు.. ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి కచ్చితంగా రాకూడదు. ప్రభుత్వం అండగా నిలబడుతుందని, వెంటనే భాస్కర్ ట్రీట్‌మెంట్‌కు ఎంత అవసరమైతే అంతా ప్రభుత్వం భరిస్తుందని మాట ఇచ్చారు. అది దాదాపు రూ.1.15 కోట్లు అయ్యింది. ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది. ఈరోజు భాస్కర్ ఇంత ఆరోగ్యంగా ఉన్నాడంటే, హ్యాపీగా మేము మళ్లీ నార్మల్‌గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం జగనన్న గారి చలవే. థ్యాంక్యూ సోమచ్.’’ అని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు.
’’మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారికి, నాకు లంగ్ డొనేట్ చేసిన డోనర్, వారి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్యూ.’’ అంటూ డాక్టర్ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి: Mega Arogya sri: మెగా ఆరోగ్యశ్రీ క్యాంపెయిన్‌లో ఏమేం చేస్తారంటే.. ఆరోగ్యశ్రీ వినియోగంపై పూర్తి వివరాలు ఇవీ..
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలకు విస్తరణ
CM Jagan on Arogyasri: ఆరోగ్యశ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం.. కొత్త కార్డుల జారీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
YS Jagan Rapthadu: జరుగుతున్న మంచి కొనసాగాలంటే మళ్లీ జగన్‌నే గెలిపించుకుందామని చెప్పండి..
