Blood facts: మనం తరచూ రక్తదానం చేస్తుంటాం. కొందరు ప్రతి ఆరు నెలలకోసారి బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. మనిషి శరీరంలో రక్తం ఎంత ఉండాలనేది . అందులో స్త్రీలు, పురుషుల్లో శరీరంలో ఎంత రక్తం ఉంటుందన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవుని శరీరంలో దాదాపు 10.5 పింట్ల రక్తం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. Blood facts
రక్తం విషయంలో లీటర్లలో కొలిస్తే మనిషి శరీరంలో దాదాపు 5 లీటర్లు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం, ఆరోగ్యకరమైన, వయోజన వ్యక్తి శరీరంలో రక్తం నిష్పత్తి అతని మొత్తం బరువులో 8 శాతం ఉండాలని వైద్యులు చెబుతారు. సాధారణ భాషలో మీ బరువు 60 కిలోలు ఉన్నారనుకోండి.. మీ శరీరంలోని రక్తం మొత్తం దానిలో 8 శాతం తప్పనిసరిగా ఉండాలి. పిల్లల రక్తం మొత్తం బరువులో 9 శాతంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అదే నవజాత శిశువులో రక్తం విషయానికి వస్తే మొత్తం బరువులో 10 శాతం ఉండాలట.
పురుషులు, స్త్రీలలో రక్తం ఎంత ఉండాలన్నది పరిశీలిస్తే.. ఆరోగ్యవంతమైన మనిషి తన శరీరంలో దాదాపు 5 నుంచి ఐదున్నర లీటర్లు (సుమారు 12.2 పింట్లు) రక్తాన్ని కలిగి ఉండాలని చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన వయోజన స్త్రీకి ఆమె శరీరంలో 4 లీటర్ల నుంచి 4.5 లీటర్లు (అంటే సుమారు 9 పింట్లు) రక్తం తప్పక ఉండాలని చెబుతున్నారు.
మానవ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా వంటి 4 అంశాలు గమనించాల్సి ఉంటుంది. మన శరీరం ప్రతి సెకనుకు కనీసం 20 లక్షల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుందన్నది అందరికీ తెలిసిందే. మనన దేహంలోని ఎముక మజ్జ మూలకణాల నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆరోగ్యవంతమైన మనిషి ప్రతిరోజూ 400 నుంచి 2000 ఎంఎల్ రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. అతని జీవితకాలంలో సుమారు 34400 లీటర్ల రక్తాన్ని ఉత్పత్తి అవుతుంది.
ఎంత రక్తం దానం చేయాలి?
అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ నివేదిక ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒకేసారి ఒక పింట్ (474 మి.లీ లేదా అర లీటరు) వరకు తన రక్తాన్ని దానం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణ భాషలో చెప్పాలంటే, శరీరంలో అందుబాటులో ఉన్న మొత్తం రక్తంలో 10% వరకు దానం చేయవచ్చని సూచిస్తున్నారు.
వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. ప్రతి 56 రోజులకు లేదా రెండు నెలల వ్యవధిలో రక్తదానం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తదానం చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే.. అతను రక్తదానం చేయకుండా ఉండాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో అతని వ్యాధి పెరగవచ్చు. బాహ్య మరియు అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలు సంభవించవచ్చు.
రక్తం తగ్గితే ఎలాంటి జబ్బులు వస్తాయంటే..
మన శరీరంలో రక్తం తగ్గడం లేదా క్షీణించడం లాంటి పరిస్థితుల వల్ల అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇందులో రక్తహీనత (రక్తహీనత లక్షణాలు) అత్యంత ప్రధానమైనది. మన బాడీలో రక్తం తగ్గిపోవడం లాంటి చర్యలను మన శరీరమే అనేక సంకేతాలను ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. కంటి చూపు అస్పష్టంగా మారడం, గోళ్లు తెల్లగా మారడం, నోటిలో పొక్కులు తరచుగా ఏర్పడటం, చర్మం రంగు తెల్లగా మారడం, అలసట, బలహీనత లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
రక్తదానం లేదా మరే ఇతర కారణాల వల్ల మన శరీరం నుంచి కొద్దిపాటి రక్తం వెళ్లిపోయినట్లయితే దాన్ని శరీరం సులభంగా తిరిగి పొందుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే శరీరంలో లభ్యమయ్యే మొత్తం రక్తంలో 15 శాతం కంటే ఎక్కువ తగ్గిపోతే ప్రాణానికే ప్రమాదమని చెబుతున్నారు. షాక్ నుంచి అంతర్గత, బాహ్య రక్తస్రావం వరకు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Blood sugar: రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ఎలా? కార్బోహైడ్రేట్లను పరిమితం చేస్తే ఉపయోగాలు ఇవీ..
Milk and dates benefits: రక్త హీనతతో బాధపడుతున్నారా? పాలలో ఇవి నానబెట్టి తింటే వేగంగా ఉపశమనం
CS Jawahar Reddy: రక్తహీనత, పౌష్టికాహార లోపాల నివారణకు తక్షణ చర్యలు
Blood: ఏ వయసు వారిలో ఎంత రక్తం ఉండాలి? తక్కువ ఉంటే ఏం చేయాలి?
Blood Purifying: రక్త శుద్ధి చక చకా జరిగేందుకు ఏ ఆహారాలు తీసుకోవాలి?
