మనం తీసుకొనే ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ తెచ్చేవి చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్ వల్ల బ్లడ్ ప్యూరిఫైయ్యింగ్ (Blood Purifying) సమస్య రావచ్చు. రక్తాన్ని శుద్ధి (Blood Purifying) చేసుకోవాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీ శరీరం యాక్టివ్ గా పని చేయాలంటే రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అవుతుంది. పోషణను అందించడంతో పాటు వ్యర్థాలను తొలగించడంలో మంచి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
1. రక్త శుద్ధి మన శరీరంలో అతి ముఖ్యమైనది. బాడీ సాధారణ పనితీరుకు, వ్యాధులను నివారించడంలో రక్తశుద్ధి దోహదపడుతుంది.
2. మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, శోషనర వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే రక్తశుద్ధి బాగుండాలి.
3. ఎలాంటి ఆహారం తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుందో తెలుసుకోవాలి.
4. ఆకు కూరలు తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫై గ్యారెంటీగా అవుతుంది.
5. రక్త శుద్ధికి గ్రీన్ లిఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. వీటిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
6. వ్యాధులను దూరం చేయడానికి సహాయపడతాయి. అలాగే పాలకూర, బచ్చలికూర, పలు రకాల ఆకు కూరలు కూడా రక్తశుద్ధికి అవసరం.
7. అవోకాడో తీసుకోవడం వల్ల రక్తశుద్ధి సహజంగా జరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్, శరీరంలో విషాన్ని బయటకు పంపే శక్తి దీనికి ఉంటుంది.
8. చర్మం సౌందర్యవంతంగా తయారు కావడానికి కూడా అవోకాడో దోహద పడుతుంది.
9. ఇవి కాకుండా బ్రోకలీ, నిమ్మకాయ కూడా రక్త ప్రసరణను బాగు చేస్తాయి.
10. బ్రోకలీ తీసుకుంటే క్యాల్షియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, పొటాషియం ఫాస్పరస్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
11. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
12. నిమ్మకాయలో ఉన్న ఔషధ గుణాలు సైతం రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి.
Also Read : Desi Ghee: నెయ్యితో ఇలా చేయండి.. జీర్ణ వ్యవస్థ మొత్తం సెట్ అయిపోతుంది!
[…] Blood Purifying: రక్త శుద్ధి చక చకా జరిగేందుకు ఏ… […]
[…] Blood Purifying: రక్త శుద్ధి చక చకా జరిగేందుకు ఏ… […]