Kanda gadda: మంచి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదంటారు పెద్దలు. మంచి ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నది వాస్తవం. మనం తీసుకునే ఆహార పదార్థాలే మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు. చాలా మందికి కూరగాయలు తినడం ఇష్టం ఉండదు. కానీ కూరగాయాల్లో మంచి పోషకాలు లభిస్తాయన్నది వాస్తవం. ఇంకొంత మంది తొందరగా అయ్యే కూరగాయలనే వండుకొని తింటుంటారు. మిగిలిన వాటి గురించి మరచిపోతుంటారు.
ఇలా చాలా మంది తినకుండా ఉండే వాటిల్లో కంద గడ్డ ఒకటి. ఇది తినడానికి అంతగా ఇష్టం చూపరు. ఈ కూరగాయ గురించి కొందరికి తెలియదు. కందగడ్డలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఈ కంద గడ్డ తింటే చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
శరీరంలో అధిక కొవ్వు పేరుకొని పోయి ఇబ్బంది పడుతుంటారు. కొలెస్ట్రాల్ పెరిగిందని బాధపడుతుంటారు. కొవ్వు మన శరీరాంలో అధికంగా ఉండటం వల్ల గుండె సమస్యలు, బరువు పెరగడంతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చి చేరుతాయి. కంద గడ్డ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కందగడ్డలో ఫైబర్ కంటెంట్ ఇందులో అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
కంద గడ్డ తినడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు, విష పదార్థాలను బయటకు పంపేస్తుంది. ఫైల్స్ వంటి సమస్యలకు కూడా కంద కడ్డ మంచి ఔషధంగా పని చేస్తుంది. కంద గడ్డను తరచూ తింటే.. పేగులు, లివర్, పొట్ట శుభ్రంగా క్లీన్ అవుతాయి.
చర్మ సౌందర్యం
కంద గడ్డల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు సీ, బీ6, బీటా కెరొటీన్ లాంటివి ఉంటాయి. దీన్ని వల్ల మీ చర్మం సాఫ్ట్‌గా, ముడతలు లేకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వారికి కూడా కందగడ్డ మంచి సొల్యూషన్, జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో దోహదం చేస్తుంది. ఈ కంద గడ్డను క్రమం తప్పకుండా తీసుకుంటే.. మంచి మేని ఛాయ మీ సొంతం అవుతుంది.
డయాబెటీస్‌తో బాధ పడుతున్న వారు కంద గడ్డ తీసుకోవడం వల్ల వెంటనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కంద గడ్డలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు కంద గడ్డ తింటే షుగర్ లెవల్స్ అదునులో ఉంటాయి.
Read also: Kandi podi: కందిపొడి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు.. దోసెల్లో వాడితే రుచి అదిరిపోవాల్సిందే..!
