మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్తం (Blood) ఉండాలి. అవయవాలు సక్రమంగా పని చేయాలన్నా, మెదడు, గుండె సక్రమంగా పని చేయాలన్నా రక్త (Blood) సరఫరా చాలా ముఖ్యం. సరైన మోతాదులో రక్తం ఉంటే శరీరం బాగా పని చేస్తుంది. ఏ యవసు వారికి ఎంత రక్తం ఉండాలనేది తెలుసుకోవాలి. శరీరంలోని రక్తం మొత్తం బరువు, వయసు, లింగంపై ఆధాపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలోని రక్తం (Blood) అంతా కలిపి శరీర బరువులో సుమారు 7 శాతానికి సమానమట.
1. మన బరువు ఆధారంగా రక్తం ఎంత ఉందనేది అంచనా వేస్తారు. చాలా మంది రక్తదానం తర్వాత రక్తం తగ్గిపోతుందని భ్రమ పడుతుంటారు. కానీ అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు.
2. రక్తదానం చేశాక మూడు నెలల సమయం తీసుకుని శరీరం తగినంత రక్తాన్ని తయారు చేసుకుంటుంది.
3. తర్వాత రక్తదానం భేషుగ్గా చేసుకోవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరికి ఎంత రక్తం ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం.
4. చిన్న పిల్లల శరీరం.. బరువులో కిలో గ్రాముకు 75 ml రక్తాన్ని కలిగి ఉంటుందట. 3.6 కిలోల బరువున్న శిశువుకు సుమారు 270 మిల్లీమీటర్ల రక్తం ఉంటుందట.
5. శిశువు శరీరంలో 2,650 మి.మీ. రక్తం ఉంటే అప్పుడు బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతమైన కేటగిరీలోకి వస్తారట.
6. ఇక పెద్ద వారి విషయంలో.. ఎక్కువ రక్తం ఉండాలట. సుమారు 70 కేజీల బరువున్న వారిలో సుమారు 4,500 నుంచి 5,700 మి.మీ. రక్తం ఉండాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు.
7. గర్భిణీ స్త్రీల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వారిలో 30 నుంచి 50 శాతం రక్తం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా వారి శరీర బరువు ఆధారంగా కొలుస్తారు.
8. చాలా మందిలో రక్త హీనత జబ్బు ఉంటుంది. అలాంటి వారిలో గుండె చప్పుడు తగ్గడం, లో బీపీ, హై బీపీ రావడం, శ్వాస వేగంగా తీసుకోవడం, బలహీనత, మత్తు రావడం లాంటి లక్షణాలు వస్తాయి.
9. అలాంటి వారు రక్తం బాగా పట్టే ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
అర్ధరాత్రి ఆకలేస్తుంటే.. ఇలా ట్రై చేయండి
1. చాలా మంది ఆకలికి తట్టుకోలేరు. కొంత మందికి మూడు పూటలా తిన్నప్పటికీ అర్ధరాత్రి పూట ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ నిద్రిస్తుంటారు.
2. కానీ వీళ్లు మాత్రం లేచి ఫ్రిజ్ లోనూ, వంటింట్లోనూ దూరి ఏమేం ఉన్నాయా.. నోటికి పని చెబుతాం అని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
3. రాత్రి త్వరగా భోజనం తినేసి పడుకుంటున్న వారికి అర్ధరాత్రి ఆకలేసే ఇబ్బందికర పరిణామం ఏర్పడుతూ ఉంటుంది.
4. సాయంత్రం పూట జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా అర్ధరాత్రి అయ్యేసరికి కడుపు ఖాళీ అయ్యి ఆకలేస్తూ ఉంటుంది.
5. ఇలాంటి సందర్భాల్లో ఆకలికి తట్టుకోలేక అర్ధరాత్రి పూట ఏదో ఒకటి లాగించేస్తూ ఉంటారు.
6. నడిరాత్రి తినడం అలవాటయ్యే వారికి చాలా సమస్యలు వేధిస్తాయి. సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దీని వల్ల మనిషికి జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
7. మానసిక సమస్య వచ్చే ప్రమాదమూ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అల్సర్ లాంటి ప్రమాదకర రోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అర్ధరాత్రి తినడం అనేది తగ్గించుకుంటే హెల్త్ మెరుగవుతుంది.
8. రాత్రి పూట ఒక్కసారి తినేసి పడుకున్నాక మళ్లీ ఉదయమే బ్రేక్ ఫాస్ట్ చేసేలా చూసుకోవాలి. అర్ధరాత్రి ఆకలేసినా కాస్త నిగ్రహించుకుంటే సరి.
9. రాత్రి పడుకొనే ముందు బ్రష్ చేసుకుంటే అర్దరాత్రి ఆకలేయడం లాంటి సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. అప్పటికీ మధ్య రాత్రిలో తినాలి అనిపిస్తే కాస్త మంచినీళ్లు తాగి పడుకుంటే సరిపోతుందంటున్నారు.
10. నీళ్లు సరిపోకపోతే కాస్త ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని ఓ రెండు ముక్కలు తినేసి పడుకోవాలట. పండ్లు తినాలని చెప్పారు కదా.. ఇక నాలుగైదు లాంగించేద్దాం అని ఆలోచించరాదు.
11. అర్ధరాత్రి సమయంలో బెర్రీస్, నట్స్, స్కిమ్డ్ పెరుగు, ఉడికించిన గుడ్లు, క్యారెట్లు వంటివి తిన్నా కడుపులో ఇబ్బందులు రావు.
12. కాబట్టి.. అర్ధరాత్రి తినే అలవాటు వీలైనంత వరకు మానుకోవాలి. లేదంటే ప్రమాదకరం కాని పదార్థాలు తీసుకోవచ్చు.
Read Also : Healthy Snacks: హెల్తీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలి.. ఇది మీకోసమే..!