Vitamin D sun: ప్రతి రోజూ కనీసం కొంత సమయం విటమిన్ డి కోసం ఎండన పడాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే, చాలా మందికి వ్యక్తిగత కారణాలు, వృత్తిగత కారణాల వల్ల ఎండలో ఉండలేకపోతుంటారు. అయితే, రోజులో ఎన్ని నిమిషాలు ఎండ మనకు తాకితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం. Vitamin D sun:
మంచి ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మంచి పోషకాహారం తినేవారికి అనారోగ్యాల ముప్పు కూడా తక్కువ ఉంటుంది. అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మపోషకాలు లభించే ఆహారం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం అనారోగ్యాలను ఎదుర్కొనేలా తయారు అవుతుంది.
అయితే, కొన్ని రకాల విటమిన్లు కేవలం ఆహారంతోనే అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి వాటిలో విటమిన్ డి ప్రధానమైనది. దీన్ని మన శరీరం ఎండ నుంచి తయారు చేసుకుంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
శరీరం సిర్కాడియన్ రిథమ్ (నిద్ర, మేల్కొనే చక్రం)ను అనుసరించడంలో సూర్యరశ్మి కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర, పేగు ఆరోగ్యానికి మధ్య నేరుగా అవినాభావ సంబంధం ఉంది. నాణ్యమైన నిద్ర పేగు ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది. అలాగే గట్ హెల్త్, మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోజనాలు పొందాలంటే శరీరానికి సరిపడా ఎండ అవసరం.
సాధారణంగా ప్రతి రోజులో కనీసం 10 నుంచి 30 నిమిషాల సమయం ఎండకు గడపాలట. దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరులో కీలకమైన విటమిన్-డి పుష్కలంగా అందుతుంది. దీంతో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. డకు ఎంత సమయం ఉండాలన్నది వ్యక్తులు, ఆరోగ్య పరిస్థితులు, భౌగోళిక లొకేషన్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.
20 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండటం అనేది ప్రతిరోజూ 12 గంటల సూర్యకాంతి ఉండే ఉష్ణమండల వాతావరణం ప్రాంతాల ప్రజలకు వర్తిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముదురు రంగు చర్మం ఉన్నవారికి రోజుకు కనీసం 30 నిమిషాల సూర్యకాంతి అవసరట.
విటమిన్ డి కోసం రోజులో కనీసం 20 నిమిషాల పాటు ఎండకు తిరగాలి. కానీ ఎక్కువ సమయం సూర్యరశ్మికి ఉంటే చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది చర్మ క్యాన్సర్‌కు దారితీస్తుందట. అందుకే ఎక్కువ సమయం ఎండకు తిరగాల్సి వస్తే సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు సన్‌స్క్రీన్ వాడటం, రక్షిత దుస్తులను ధరించడం వంటి చర్యలు తీసుకుంటే చర్మ ఆరోగ్యం దెబ్బతినకుండా సూర్యరశ్మి నుంచి మంచి ఆరోగ్యం పొందే వీలుంది. శీతల ప్రాంతాల్లో నివసించే ప్రజలు సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండొచ్చు. విటమిన్ డి వీరి శరీరంలో సమర్థవంతంగా ఉత్పత్తి అవ్వడానికి రోజుకు కనీసం రెండు గంటల సమయం ఎండకు తిరగాల్సి ఉంటుంది.
Read Also: Vitamin D Deficiency: విటమిన్-డి కోసం రోజూ ఎంతసేపు ఎండలో ఉండాలి? వైద్యులు ఏం చెబుతున్నారు?
