Vitamin D Deficiency: శరీరంలో విటమిన్ డీ లోపాన్ని భర్తీ చేయడానికి ఎండలో తిరగడం ముఖ్యం. ఉదయాన్నే సూర్యరశ్మి మన శరీరానికి తగలడం వల్ల ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడానికి సాయపడుతుంది. విటమిన్ డీ లోపాన్ని తీర్చడానికి, ఎప్పుడు, ఏ సమయంలో ఎండలో కూర్చోవాలనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. విటమిన్ డీ అనేక ప్రోటీన్లు, ఎంజైమ్‌ల ఏర్పాటులో సహాయపడుతుంది. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుందని పోషకాహర నిపుణులు పేర్కొంటున్నారు. (Vitamin D Deficiency)
చాలా మందికి విటమిన్ డీ లోపం ఉంటుంది. శరీరానికి తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతుంటుంది. రాత్రిపూట ఆఫీసుల్లో పనులు చేసుకొనే వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. రాత్రంతా పని చేయడం ఉదయం పడుకోవడం చాలా మంది చేసే పని. ఇలాంటి వారిలో విటమిన్ డీ లోపం త్వరగా వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి?
మన శరీరంలో విటమిన్ డీ లోపించడం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినడం, జుట్టు రాలడం, మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడం, శ్వాసకోశ సమస్యలు వంటివి అటాక్ చేస్తాయి. విటమిన్ డీని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది సూర్యరశ్మితోపాటు కొన్ని ప్రత్యేక ఆహారాల నుంచి మనకు ఎక్కువగా చేకూరుతుంది. ప్రతి రోజూ శరీరానికి 600 UI విటమిన్ డీ అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లోని బాల్కనీలో లేదంటే ఆరు బయట ఉదయాన్నే పడే ఎండకు సుమారు అరగంట పాటు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సమస్యలున్న వారు, లేత చర్మం ఉన్నవారు కనీసం 15 నిమిషాలైనా ఉదయాన్నే ఎండకు ఉండగలిగితే విటమిన్ డీ లోపాన్ని నివారించుకోవచ్చు. మరోవైపు ఎండలో కూర్చున్నప్పుడు ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి కళ్లను రక్షించుకోవాలి. నేరుగా సూర్య కిరణాలు కళ్లను తాకడం చాలా ప్రమాదకరం.
చర్మం ముదురు రంగులో ఉన్న వ్యక్తులు 30 నిమిషాల కంటే ఎక్కువ ఎండలో కూర్చోరాదు. స్కిన్ కలర్ ఫెయిర్ 15 నిమిషాలు మాత్రమే ఎండలో ఉండాలి. ఎక్కువ కాలం సూర్యరశ్మికి గురికాకుండా ఉండటం ఉత్తమమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఎండలో ఉన్న తర్వాత సన్‌స్క్రీన్ ఉపయోగించాలని, ఎండలో కూర్చున్నప్పుడు సన్‌స్క్రీన్ రాయకూడదని హెచ్చరిస్తున్నారు.
ఏ ఆహారాలు తీసుకుంటే మంచిది?
విటమిన్ డీ లోపాన్ని తీర్చడానికి, సాల్మన్ చేపలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చేప విటమిన్ డీ ఉత్తమ మూలం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చేపలు తినడానికి ఇష్టపడని వారు కాడ్ లివర్ ఆయిల్ తీసుకోవచ్చు. కాడ్ లివర్ ఆయిల్ పోషకాలను పొందడానికి గొప్ప మార్గం. ఇది మెడికల్ షాప్ లో లభిస్తుంది. విటమిన్ డీ లోపాన్ని తీర్చడానికి గుడ్డు పచ్చసొనను తినొచ్చు. గుడ్లలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డీ లోపాన్ని పూడ్చడానికి పుట్టగొడుగులు, ఆవు పాలు, సోయా పాలు, నారింజ రసం, వోట్మీల్ లాంటివి తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.
Read Also : Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్ హావభావాలు.. వీడియో క్లిప్స్ వైరల్!