Miriyalu: వంటగదిలో నిత్యం అందుబాటులో ఉంచుకొనే వాటిలో మిరియాలు కూడా ఒకటి. మిరియాలు మితంగా వాటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి మిరియాలు మంచి ఔషధమని నిపుణులు చెబుతున్నారు. పరిమితంగా వాడటం ముఖ్యమంటున్నారు. Miriyalu
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ముఖ్యమైనది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే.. ఏ పని అయినా బాగా చేయగలుగుతారు. శరీరంలో మిగిలిన భాగాలకు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశాలు మెదడు ఇస్తుంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా, ఎప్పటికప్పుడు పని చేస్తాయన్నది తెలిసిన విషయమే. ఈ మధ్య చాలా మంది మతి మరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారిన అనేక అధ్యయనాలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
మెదడుకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, జీవనన శైలిలో మార్పులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తల్లి గర్బంలో ఉన్నప్పుడే మెదడు కణాల నిర్మాణం అనేది ప్రారంభం అవుతుంది. మెదడు కణాలు ఒక్కసారి పుట్టాయంటే మరణించే వరకు అవే కణాలు ఉంటాయి. ఈ కణాలు ఒక్కసారి మరణిస్తే.. మరలా పుట్టడం జరగవు.
మెదడు కణాలు చనిపోకుండా, వాటిలో ఇన్ ప్లామేషన్ రాకుండా చూసుకోవాలి. మెదడు కణాలు కనుక చనిపోతూ ఉంటే చాలా నష్టం వాటిల్లుతుంది. బ్రెయిన్‌లో కొన్ని రకాల హానికర ప్రోటీన్లు రిలీజ్ అయి మెదడు కణాలను నశింపజేస్తాయి. ఇలాంటి వాటి నుంచి మెదడు కణాలను కాపాడాలంటే వంటగదిలో మనకు అందుబాటులో ఉండే మిరియాలు బాగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మిరియాల్లో పెప్పరిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ కణాలను నాశనం చేసే ప్రోటీన్‌ను నాశనం చేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయ పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మతిమరుపు, డిమెన్షియా వంటికి రాకుండా చేస్తుంది. వంటల్లో కారానికి బదులుగా మిరియాలను వాడటం ఉత్తమం అని చెబుతున్నారు. అలాగే సలాడ్స్, సూప్స్, స్నాక్స్ వంటి వాటిల్లో మిరియాల పొడిని వినియోగిస్తే మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే మరీ ఎక్కువగా కాకుండా మితంగా ఉపయోగించాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Miriyalu Benefits: మిరియాలతో ఉపయోగాలేంటి? రోగ నిరోధక శక్తిని ఏ రకంగా పెంపొందిస్తుందంటే…
Black Pepper: నల్ల మిరియాలతో ఈ జబ్బులన్నీ పరార్.. బెస్ట్ హెల్త్ టిప్స్ ఇవే!
Ulavacharu: పుల్ల పుల్లగా.. కారం కారంగా.. యమ టేస్టీగా ఉలవచారు.. తయారు చేసే విధానం ఇదీ!
Vankaya: వంకాయ వంటి కూరయు.. పంకజముఖి సీతవంటి భామామణియున్.. వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..
Chicken fry recipe: నోరూరించే చికెన్ ఫ్రై.. ఎలా తయారు చేసుకోవాలంటే.. అదిరిపోయే టేస్ట్ కోసం ఇలా చేయండి..
