HomeInternationalTim Chen: రూమ్‌ రెంట్‌ నెలకు రూ.1,74,358.. విమానం ఖర్చు రూ.99,631.. చదువుకోసం ఈ కుర్రాడు...

Tim Chen: రూమ్‌ రెంట్‌ నెలకు రూ.1,74,358.. విమానం ఖర్చు రూ.99,631.. చదువుకోసం ఈ కుర్రాడు ఏం చేశాడంటే..!

Tim Chen: మనదేశంలో ప్రాథమిక విద్య అనంతరం యువత చాలా మంది హాస్టళ్లలో ఉంటూ దూర ప్రాంతాల్లో చదువుతూ ఉంటారు. ఈ క్రమంలో హాస్టల్‌ ఖర్చులు, లేదా రూమ్‌ రెంట్‌ తడిసి మోపెడవుతుంటాయి. సాధారణంగా మన దేశంలో హాస్టళ్లు లేదా రూమ్‌ రెంట్‌ ఖర్చులు నగరాలను బట్టి కాస్ట్‌ ఉంటాయి. మెట్రో నగరాలు, ప్రముఖ పట్టణాల్లో కాస్త కాస్ట్‌లీగా ఉంటాయి. కానీ ఈ కథనంలో చెప్పినంత మాత్రం కాదండోయ్.. ఓ కుర్రాడు రూమ్‌ రెంట్‌ కట్టేబదులుగా విమానంలో అప్‌అండ్‌డౌన్‌ చేయడం బెటరని ఫిక్స్‌ అయ్యాడు. అదెలాగో చదవండి.. Tim Chen

కెనడా దేశానికి చెందిన ఓ యువకుడు స్టడీస్‌ కోసం మనం బస్సులో అప్‌అండ్‌ డౌన్‌ చేసినట్లుగా అతడు ఏకంగా విమానంలో అప్‌అండ్‌ డౌన్‌ చేసేస్తున్నాడు. కెనడాలోని కాల్గరీ నివాసి అయిన టిమ్‌ చెన్‌.. ఈ సాహసం చేస్తున్నాడు. కాల్గరీ నుంచి చదువు కోసం వాంకోవర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నగరాల మధ్య దూరం అక్షరాలా 687 కిలోమీటర్లు. ఎవరైనా ఇంత దూరం ఉంటే ఏం చేస్తారు? ఎంచక్కా అక్కడే ఏ హాస్టలో, రూమో చూసుకొని చదువుకుంటారు. టిమ్‌ చెన్‌ కూడా అదే చేయాలనుకున్నాడు. తీరా అక్కడికెళ్లి రూము కోసం వెతికాడు. అక్కడ రూమ్‌ అద్దెలు అడిగితే అవాక్కవ్వాల్సి వచ్చింది. వాంకోవర్‌లోని ఒక బెడ్‌ రూమ్‌ అపార్ట్మెంట్ అద్దెకు దాదాపు $2100 (రూ.1,74,358) ఖర్చు అవుతుంది. అయితే, కాల్గరీ నుంచి వాంకోవర్‌కు విమాన సర్వీసులు విరివిగా ఉన్నాయి. ఒక రౌండ్ ట్రిప్ విమానానికి దాదాపు $150 ఖర్చు అవుతుంది. ఇది నెలకు దాదాపు $1200 (రూ. 99,631) మాత్రమే.

దీంతో టిమ్‌ చెన్‌ నెలవారీ అద్దె చెల్లించడం కంటే విమానంలో అప్‌ అండ్‌ డౌన్‌ చేయడమే బెటరని ఫిక్స్ అయ్యాడు. కానీ ప్రతిరోజూ కాదండోయ్‌.. ఇతడు వారానికి రెండు క్లాసులకు హాజరైతే సరిపోతుంది. యూనివర్సిటీలో వారానికి రెండు తరగతులకు మాత్రమే హాజరవుతాడు. అందుకే విమాన ప్రయాణమే చవకగా ఉంటుందని వారానికి రెండు సార్లు ప్రయాణిస్తూ చదువు కొనసాగిస్తున్నాడు.

ఇవీ చదవండి: American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు
Jagananna Ammavodi: చక్కటి చదువుల కల్పవల్లి.. అమ్మ ఒడి-బతుకులు మార్చే గుడి.. నాలుగేళ్లుగా అప్రతిహతంగా…!
edX MOU: ఎడెక్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకం.. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం..: సీఎం జగన్‌
Kancha ilaiah: జగన్‌మోహన్‌రెడ్డి ఓడితే ఆయనకు నష్టం లేదు.. నష్టపోయేది పేదలే.. కంచె ఐలయ్య ప్రసంగం తప్పక చదవాల్సిందే..
Tableaux Wins Third Prize: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి.. ఆకట్టుకున్న డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు