Black Pepper: మన వంటింట్లో దొరికే వాటిలో మిరియాలు (Black Pepper) ప్రధానమైనవి. మిరియాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి ఒక్కరూ మిరియాలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి కూడా మిరియాలు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. మిరియాలతో ఉపయోగాలను ఈ కథనంలో తెలుసుకోండి..
తెలుగు వారు మిరియాల (Black Pepper) రసం చేసుకొని అన్నంలో తింటుంటారు. కేరళ వాసులైతే వారు తాగే టీలో మిరియాల పొడిని కలుపుకుంటారు. శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించే శక్తి యాంటీ ఆక్సిడెంట్లకు ఉంటుంది. అనేక కూరల్లో, చికెన్, మటన్ కర్రీలు స్పైసీగా రావాలంటే మిరియాలతో మసాలా తప్పక ఉండేలా చూసుకుంటూ ఉంటారు.
మసాలా దినుసుల్లో మిరియాల పాత్ర ఎనలేనిది. రుచికి ఇవి కాస్త ఘాటుగా ఉన్నప్పటికీ ఆరోగ్య సంరక్షణలో మాత్రం బోలెడు ఉపయోగాలున్నాయి. మిరియాల్లో ఉండే ఘాటైన పిపరైన్ చాలినైన్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు దోహదపడతాయి. మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పేగుల్లోని బ్యాక్టీరియాలను నాశనం చేసి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కడుపును పరిశుభ్రం చేస్తాయి. దంతాలు తెలుపు రంగోలకి మారి, చిగుళ్ల సమస్యలు తొలగి పోవాలంటే మిరియాల పొడి, ఉప్పు కలిపి పళ్లు తోముకోవాలి.
జీర్ణ సమస్యతో బాధపడుతున్న వారికి మిరియాలు చక్కగా పని చేస్తాయి. మిరియాల చారు తాగితే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. శరీరంలో చాలా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు మిరియాల రసం ఉపయోగపడుతుంది. రక్తంలోని కొవ్వును కూడా కరిగించి బీపీని అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తుంది. కలరాతో బాధపడుతున్న వారికి మిరియాలు బాగా నూరి చిన్న చిన్న గోళీలు చేసి తినిపిస్తే బిగ్ రిలీఫ్ ఇస్తుంది.
దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకుంటే మంచి ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే త్వరగా ఫలితాలు చూస్తారని ఆయుర్వేద వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగితే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
మిరియాల వల్ల జీర్ణక్రియ సరిగా పని చేస్తుంది. ఆయుర్వేదంలో నల్లమిరియాల పాత్ర ఎనలేనిది. శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించేందుకు మిరియాల రసానికి మించిన వైద్యం మరోటి లేదంటారు పెద్దలు. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. తర్వాత దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి వేడి చేసి మరిగించాలి.
ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టుకోవాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకుంటే మరింత మంచిది. గొంతు గరగర సమస్య వెంటాడుతుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగాలి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Cricket: క్రికెటర్ల ముఖంపై తెల్లటి పూత ఎందుకు పూసుకుంటారు?