HomeLife StyleLose belly fat: కొవ్వును కరిగించేందుకు ఆపసోపాలు పడుతున్నారా? ఈ టిప్స్‌ పాటించండి

Lose belly fat: కొవ్వును కరిగించేందుకు ఆపసోపాలు పడుతున్నారా? ఈ టిప్స్‌ పాటించండి

Lose belly fat: ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్, కొవ్వు అధికంగా పేరుకుపోవడం అందరినీ వేధిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా వచ్చిపోయిన తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెరిగింది. ఆయిల్‌, జంక్‌ ఫుడ్‌ను వీలైనంత వరకు అవాయిడ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా వంటింటి చిట్కాలతో కొవ్వును ఇట్టే కరిగించవచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. Lose belly fat

1. శరీరంలో కొవ్వు పేరుకుపోయే ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా ప్రమాదం. ఇలాంటి వాటి వల్ల గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

2. కొవ్వు, చెడు కొలెస్ట్రాల్‌ను పోగొట్టేందుకు కొన్ని రెమెడీస్‌ పాటించాలి.

3. రక్తనాళ్లలో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు దోహదపడతాయి.

4. అవిసె గింజుల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

5. అవిసె గింజుల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే మంచి కొవ్వు దాగి ఉండటం వల్ల శరీరానికి మేలు కలిగిస్తుంది.

6. 30 రోజుల పాటు రోజూ 25 నుంచి 30 గ్రాములు అవిసె గింజల్ని తినాలి. ఇలా చేయడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే శాతం తగ్గిపోతుంది.

7. గుండెజబ్బులు వచ్చి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్నవారు అవిసె గింజల్ని రోజుకు 25 గ్రాములు తీసుకోవచ్చు.

8. అవిసె గింజలతో లడ్డూలు చేసుకొని తింటే మరింత రుచిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

9. గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో నువ్వుల నూనె ఒక టీ స్పూను, అల్లం రసం టీ స్పూను మోతాదులో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా చేస్తే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు ఇట్టే తగ్గిపోతుంది.

10. రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపునే ఏమీ తినకుండా తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గించ‌డానికి ఎంతో దోహదం చేస్తుంది.

11. ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ రసం పిండాలి. ఇలా ఉదయాన్నే తాగాలి. క్రమం తప్పకుండా తాగితే కొవ్వు తప్పకుండా కరిగిపోతుంది.

ఇదీ చదవండి: Açaí berry: అకాయ్‌ బెర్రీలు నెలరోజులపాటు ప్రతి రోజూ తినడం వల్ల మీ శరీరానికి జరిగేది ఇదే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు