HomeAndhra PradeshYS Jagan valunteers: ఇక స్లీవ్స్‌ మడచాల్సిన సమయం వచ్చింది.. : సీఎం జగన్‌ మాస్‌...

YS Jagan valunteers: ఇక స్లీవ్స్‌ మడచాల్సిన సమయం వచ్చింది.. : సీఎం జగన్‌ మాస్‌ స్పీచ్‌

YS Jagan valunteers: ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం తరఫున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రజల్లో బలం గానీ, విశ్వసనీయత గానీ లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మనసేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. పేదవాడి భవిష్యత్ కోసం నిలబడటానికి మీరు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చిందని మాస్‌ స్పీచ్‌ ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. YS Jagan valunteers

* అబద్ధాల యోధుల్ని మట్టికరిపించాల్సిన సమయం వచ్చింది.
* మీ మేధకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగానిలబడాల్సిన సమయం వచ్చింది.
* పేదవాడి భవిష్యత్ మారాలంటే, వారి బతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అంటే మరో సారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 58 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, పేదలందరికీ వివరించాలి. ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలకు తీసుకొని రావాలి.

* పెత్తందార్ల మీద పేదల పక్షాన మనందరరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో బాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. తమకు అందుతున్న పకథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.
* 2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలు రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలుమాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికీ ఓ జాబు, లేదంటే 2 వేల నిరుద్యోగభృతి ఇస్తానని ఇదే పెద్దమనిషి చంద్రబాబు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి.

* ఆ వాగ్దానాలను ఆయన ఎలా ఎగ్గొట్టాలని కోటయ్య కమిటీ అని కోతల కమిటీ వేస్తే మీ బిడ్డ మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా భావించి మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికీ మంచి చేస్తున్నాడని చెప్పండి.

* బాబును నమ్మడం అంటే ఇంగ్లీషు మీడియం బడుల్ని, సీబీఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడునేడుని, అమ్మ ఒడిని, గోరుముద్దను, పిల్లలకిచ్చే ట్యాబుల్ని, క్లాస్ రూమును డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్ పీ ప్యానల్స్ ను పెడుతున్న మన స్కూళ్లను,క్లాస్ రూముల్ని వీటన్నింటికీ రద్దు చెబుతూ మన పిల్లల బంగారు భవిష్యత్ ను మనమే తాకట్టు పెట్టడం అని చెప్పండి.

* బాబు వాగ్దానాల్ని రైతు నమ్మడం అంటే 2014 మాదిరిగా మరోసారి తాము నిలువునా మునగడానికి సిద్ధం కావడం అని చెప్పండి.
* అక్కచెల్లెమ్మలు బాబును నమ్మడం అంటే పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్లీ నమ్మవచ్చా అని అడగండి.

* బాబుకు ఓటేయడం అంటే ఇంటింటికీ వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకొద్దు. జన్మభూమి కమిటీలు మళ్లీ రావాలి అని ఓటు వేయడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* చంద్రబాబు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* బాబుకు ఓటు వేయడం అంటే ఈ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రద్దు చేయడమే అని మీకు మీరే ఆమోదం తెలపడమే నని, జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రముఖిలు వస్తాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.

* వాలంటీర్ చెల్లెమ్మలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, ఈ పెత్తందార్ల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని ప్రతి చెల్లెమ్మా చెప్పండి.
* మేమూ సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి. ఈ 58 నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడావారధులు మీరే.

* రాష్ట్ర వ్యాప్తంగా 84 శాతం ఇళ్లలో మంచి జరిగింది. ఎక్కడా లంచాలు లేవు వివక్ష చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం ఇళ్లకు మేలు జరిగింది. ఎప్పుడూ చూడని మార్పులు కనిపిస్తున్నాయి.

read also: Jagan on babu manifesto: ఈ కార్యక్రమాలను ఎవరైనా టచ్‌ చేయడానికి కూడా ధైర్యం ఉండదు..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు