Jagan on babu manifesto: సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం కంటే డబుల్ ఇస్తానంటూ చంద్రబాబు మరోసారి మోసపూరిత హామీలు గుప్పిస్తున్నాడంటూ సీఎం జగన్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.. ఆయన ఇంకా ఏమన్నారంటే.. Jagan on babu manifesto
* మీ బిడ్డ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు ఎవరికైనా కూడా టచ్ చేయడానికి ధైర్యం సరిపోదు.
* అలాంటి కార్యక్రమాలు సామాజిక పెన్షన్లు రూ.3 వేలు ఇచ్చే పెన్షన్లు గానీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ప్రతి పేదవాడికీ సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 కార్యక్రమాలు, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ,ఇలా ఈ 8 పథకాలకు రూ.52,700 కోట్లు అవుతుంది.
* ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి.
* మరి ఈ 52,700 కోట్లు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన ఆరు పథకాలు అవి కూడా కలిపితే ఆరు స్కీములకు అయ్యే ఖర్చు 73 వేల కోట్లు. టచ్ చేయలేని స్కీములు మరో 52 వేల కోట్లు. మొత్తం 1,26,140 కోట్లు లెక్క తేలుతోంది.
* ఆలోచన చేయమని కోరుతున్నా. సంవత్సరానికి మీ బిడ్డ 70 వేల కోట్లు ఇచ్చే కార్యక్రమం చాలా కష్టపడితే, వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే ఎక్కడా లంచం లేకుండా చేస్తే ఇంతగా పారదర్శకంగా చేస్తే కష్టపడితే 70 వేల కోట్లు ఇచ్చే పరిస్థితి.
* గతంలో ఏవీ చేయని ఈ వ్యక్తి, గత చరిత్ర అంతా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి.. 1.26 లక్షల కోట్లు ఇస్తున్నాడంటే.. ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇది అయ్యేదా.. మళ్లీ మోసం చేయడం కాదా?
* రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరంతా భావి లీడర్లు అవుతారు. లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే కష్టమైనా, నష్టమైనా ఆ మనిషి మాటమీద నిలబడతాడు అనే నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి.
* ఆ విశ్వసనీయత ఏరోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో ఆ లీడర్ ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమానీ వాలంటీర్ అయినా కాలర్ ఎగరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్పూర్తి అనే పరిస్థితి వస్తుంది.
* 1994లో తీసుకున్నా, 1999లో తీసుకున్నా, 2014లో తీసుకున్నా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో అధికారంలోకి రాక ముందు రంగురంగులతో ఉంటుంది. 600 హామీలుంటాయి.
* ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేస్తారు. కనీసం వాళ్ల వెబ్సైట్స్ లో కూడా మాయం చేస్తున్న పాలన చంద్రబాబు హయాంలో చూశాం.
* ఈ నిజాలన్నీ మన వాలంటీర్ వ్యవస్థ అర్థం చేసుకొని ప్రజల కోసం, ప్రజలు మోస పోకూడదని బాబు రంగుల్ని, బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి.
* చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో ప్రతి పేదకూ చెప్పాలి.
read also: YS Jagan fires on Chandrababu: ఇచ్చేది లేదు.. సచ్చేది లేదు.. చంద్రబాబుపై సీఎం జగన్ పంచ్‌లు..
Justice for Geethanjali: గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్
Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ నేడు కీలక భేటీ
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
