HomeAndhra PradeshYS Jagan Comments: జగన్‌ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు.. మంచి జరిగి ఉంటేనే సైనికులుగా ముందుకు...

YS Jagan Comments: జగన్‌ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు.. మంచి జరిగి ఉంటేనే సైనికులుగా ముందుకు రండి..

YS Jagan Comments: 58 నెలల పాలనలో వ్యవస్థాగత మార్పులు తీసుకురాగలిగామంటే అందుకు కారణం సచివాలయ వ్యవస్థ, దానితో అనుసంధానమైన నా తమ్ముళ్లు, చెల్లెమ్మల వాలంటీర్ల వల్లే సాధ్యమైందని సీఎం జగన్‌ అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే.. YS Jagan Comments

* ప్రతి పక్షం చేస్తున్న దాడి నా మీద కాదు.. ప్రతిపక్షానికి అంతా తెలుసు.కేవలం జగన్ అనే ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు.
* మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ ఇంత మంది యుద్ధం చేస్తున్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున.
* కానీ వీళ్లంతా మర్చిపోతున్నది ఏమిటో తెలుసా.. ఈ ఒకే ఒకడికి ఉన్నది ఇంత పెద్ద సైన్యం ఉంది అని వీళ్లంతా మర్చిపోతున్నారు.
* పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు. మంచి చేసిన ఆ ప్రతి ఇంటినీ నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా చెప్పగలుగుతాడు. ఈరోజు కళ్లలో కళ్లుపెట్టి చూసి చెప్పగలుగుతాడు.

* మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు. ఈ చిత్తశుద్ధి ఈ నిబద్ధత ఈరాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? చెప్పగలడా ఇలా?
* వారి దాడి ఇంటింటికీ అందుతున్న సంక్షేమం మీద దాడి. ప్రతి పేద కుటుంబానికి, వాలంటీర్ కు ఒక్క విషయం నా గుండె లోతుల్లో నుంచి చెబుతున్నా.

* ఈ 58 నెలల్లో ఏ ప్రభుత్వం చేయనంతగా ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం.
* మనం మాత్రమే మేనిఫెస్టో అనే దానికి విశ్వసనీయత తీసుకొచ్చాం. 99 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టో తీసుకొని ప్రజల ఇంటికి పోయి అన్నదమ్ములు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలకు చూపించి మీరే నిర్ధారించండి అని చెప్పగల నిబద్ధత కలిగిన ఏకైక ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం.

* మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పగలిగాం. పేదలకు ఒక సొంత ఇంటికి కలగా కాకుండా హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం. మనసు పెట్టి చేశాం.
* ప్రతి పేద గడపకూ అందిన మంచిని అటు పేదలకు, ఇటు సమాజానికి వివరించడానికి గానీ, లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరినీ స్టార్ క్యాంపెయినర్లుగా మార్చేందుకు గానీ మీరు ఈ రెండు నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, బలపడుతుంది.

* ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. కాబట్టే ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడి నోట్లో నుంచి చంద్రబాబు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లు కారణమని ఒకడంటాడు.
* వాలంటీర్ల దెబ్బకు ప్రజలకు దగ్గకాళ్ల కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతాను అని అంటాడు.
* తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తాం అంటారు.

* ఇంత మందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం ఈరోజు మీరు నేను మన ప్రభుత్వం ప్రతి పేదవాడికీ డెలివర్ చేసింది కాబట్టే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాం.
* వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే.. వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి.

* ప్రజల కడుపులు అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టే.
* వారిది నీటితో తీరే దాహం కాదు, అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం, వారికి కడుపు నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే.
* ఇలాంటి విష వృక్షాలు ఉన్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం.
* మనకు ఉన్నది, వాళ్లకు లేనిది మాత్రం పైన దేవుడి దయ, మంచి చేశాం అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు వేయడం.

* చెడిపోయిన ఈ వ్యవస్థను బాగు పరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తున్నాడు. 58నెలలు దాటాం. మీ బిడ్డ మీ అన్న ఇంకో 10-15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, పేదవాడి ఇంట్లోఉన్న ఒకటో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీషుమాట్లాడతాడు.
* పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా.

* రాబోయే రెండు నెలలు మంచి చేసిన మన ప్రభుత్వాన్ని ప్రజల గుండెల్లోకి, వారి ఇళ్లలోకి స్థానం సంపాదించుకొనే కార్యక్రమం చేస్తూ ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయినర్లకు బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని మిమ్మల్నందరినీ కోరుకుంటూ మీ అందరికీ మీ అన్న ఎప్పుడూ మీ వాడిగా ఉంటాడు అని మరోసారి చెబుతున్నా.

read also: YS Jagan valunteers: ఇక స్లీవ్స్‌ మడచాల్సిన సమయం వచ్చింది.. : సీఎం జగన్‌ మాస్‌ స్పీచ్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు