YS Jagan in Phirangipuram: వాలంటీర్లు భావి లీడర్లని సీఎం జగన్ అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. వాలంటీర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. YS Jagan in Phirangipuram
* ఇంతటి చిక్కటి చిరునవ్వులు, ప్రేమానురాగాలు, ఆప్యాతల మధ్య, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోడం సంతోషం.
* మీ అందరితో ఈరోజు 5 సంవత్సరాల ఈ పరిపాలనలో పేదవాడి భవిష్యత్ ఏరకంగా మార్చాలని తపన, తాపత్రయంతో అడుగులు వేశాం, విప్లవాన్ని తీసుకొచ్చామనే విషయాలు మనందరం కాస్త జ్ఞాపకం తెచ్చుకోబుతున్నాం.
* ఇక్కడున్న నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు అందరూ నా మీద ప్రేమతో, నమ్మకంతో, మన ఎజెండా మీద మమకారంతో, మనం అమలు చేస్తున్న మేనిఫెస్టో మీద నమ్మకంతో, నవరత్నాల పథకాల్ని, పరిపాలన సంస్కరణల్ని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ.
* ఇది ప్రతి పేద ఇంటా వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడూ రాబోయే తరం ఆ పేదవాడి ఇంట్లో బయటకు వచ్చి పేదరికం సంకెళ్లు తెంచుకోవాలని తపన, తాపత్రయంతో మనం తీసుకొస్తున్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా లంచం తీసుకోకుండా, వివక్ష అనేది లేకుండా ప్రతి పేదవాడికీ అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, తమ్ముళ్ల రూపంలో కూర్చొని ఉన్నారు.
* మొదటి రోజే నేను చెప్పాను. మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని. మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతున్నారు అని చెప్పా.
* ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లు అంతా నా వాళ్లు అని గర్వంగా తెలియజేస్తున్నా.
* మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే,ప్రతి పేదవాడి భవిష్యత్ ను మార్చాలని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు.
ఇదీ చదవండి: Volunteers Andhra Pradesh: వాలంటీర్లకు పెరిగిన గౌరవం.. ప్రోత్సాహమిస్తూ సీఎం జగన్ చిరు సత్కారాలు..
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్
Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ నేడు కీలక భేటీ
