HomeAndhra PradeshPhirangipuram CM jagan: ప్రజలకు అలసిపోకుండా సేవ చేశాం.. నా వాలంటీర్ల సైన్యం అంటూ సీఎం...

Phirangipuram CM jagan: ప్రజలకు అలసిపోకుండా సేవ చేశాం.. నా వాలంటీర్ల సైన్యం అంటూ సీఎం జగన్‌ భావోద్వేగం

Phirangipuram CM jagan: మనమంతా పేదలకు సేవ చేశాం. అలసిపోకుండా సేవ చేశాం. మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా 58 నెలలు పేదలకు సేవ చేశాం.. అంటూ సీఎం జగన్‌ కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. Phirangipuram CM jagan

* ఇక రెండు నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు, యుద్ధానికి సిద్ధమా అని అడుగుతున్నా.
* 2.60 లక్షల సైన్యం, నా సైన్యం, నా వాలంటీర్ల సైన్యం, మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకొనే సైన్యం.
* ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు, తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావివి.

* ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* ఈ గుండెల్లో మానవత్వం ఉంది. లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి, వివక్ష లేని వ్యవస్థ తీసుకుని రావాలని తపన తాపత్రయం ఉంది.

* తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన, వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దిపండానికి కారణమైతే, 2019లో మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు, వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ పేదలకు వారధిగా, సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు 2019 తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారకులయ్యారు.

* ఈ వ్యవస్థలు, పేదల వ్యవస్థలు, ప్రజా వ్యవస్థలే, పరిపాలనను మార్చిన ఈ వ్యవస్థలే 2024 ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్రయాత్రకు దారులు కూడా ఇవే వేస్తాయి అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన, టీడీపీ వాళ్లు జన్మభూమి కమిటీల పేరిట వాళ్లు చేస్తే, మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య తేడా ఏమిటంటే.. జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మన వ్యవస్థలు మన ప్రభుత్వం మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి.

* మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్నీ, గ్రామంలోని బడిని, ఆస్పత్రిని మార్చాయి.
* గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతున్నా.
* మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, అన్నదమ్ముడికి, రైతన్నకు చూపవచ్చు.

* మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు కొండంత అండగా నిలబడుతున్నాం.
* మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల కారణంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా రూ.3 వేలు అవ్వాతాతల చేతుల్లో పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో ఆదివారమైనా సరే, సెలవు దినమైనా సరే గుడ్ మార్నింగ్ చెబుతూ రూ.3 వేలు ఇచ్చే పెన్షన్ గానీ, ఇతర పౌర సేవలు గానీ ఇంటికే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం ఇది మనం తీసుకొచ్చిన మార్పు వల్లే.

* సచివాలయాలు, వాటితో అనుసంధానమైన వాలంటీర్ల వ్యవస్థ.. ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏర్పాటు చేసిన గ్రామ స్థాయిలోని విలేజ్ క్లినిక్స్ గానీ, జల్లెడ పడుతూ వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్న ఆరోగ్య సురక్ష గానీ,
* మారుమూల పల్లెల్లో ఉన్నా పేదలకు 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కనీ వినీ ఎరుగని ఆరోగ్య భరోసాను మన వ్యవస్థలు గ్రామ స్థాయిలోనే ఇస్తున్నాయి.

read also: YS Jagan in Phirangipuram: భావి లీడర్లు నా వాలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలు: సీఎం జగన్‌
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు