HomeLife StyleEarly morning Tea: ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎంతటి నష్టమో తెలుసా?

Early morning Tea: ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎంతటి నష్టమో తెలుసా?

Early morning Tea: చాలా మంది ఉదయం నిద్ర నుంచి లేవగానే బెడ్‌ కాఫీ, లేదా టీ తాగడం అలవాటు ఉంటుంది. అలాగే కాస్త ముఖం కడుక్కున్న తర్వాత కూడా టీ లేదా కాఫీలు తాగుతుంటారు. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఉదయాన్నే పరగడుపున టీ, కాఫీలు తాగకూడదట. ఎందుకంటే పలు కారణాలను నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు. Early morning Tea

ఉదయాన్నే టిఫిన్‌ లేదా అల్పాహారం తినకుండా కనీసం మంచి నీరైనా తాగకుండా కాఫీ, టీలు తాగరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే కడుపులో సమస్యలు వస్తాయంటున్నారు. ఇలా చేయడం వల్ల అల్సర్‌, కేన్సర్‌ లాంటి తీవ్రమైన జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. రోజంతా మనం తిన్న ఆహారం రాత్రికి అరిగిపోతుంది. ఉదయానికల్లా ప్రేగులు, పొట్ట ఖాళీ అవుతాయి. ఇలాంటి సమయంలో కాస్త గోరు వెచ్చని నీళ్లు తాగి ఆ తర్వాత వ్యాయామం చేయాలట. దాని తర్వాత అల్పాహారం తీసుకోవాలి. అటు తర్వాత ఓ గంట గ్యాప్‌ ఇచ్చి టీ కాఫీ లాంటివి తాగినా పెద్దగా ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఖాళీ కడుపులో టీ తాగరాదని స్పష్టం చేస్తున్నారు.

1. ఉదయాన్నే నిద్ర లేవగానే, అలాగే సాయంత్రం పూట టీ తాగడం చాలా మందికి దిన చర్యలో భాగమైపోయింది.

2. చాలా మందికి టీ తాగడం ఒక ఎమోషన్‌గా భావిస్తారు. ఎంతటి తలనొప్పి పరిస్థితులు ఉన్నా ఒక్క టీ తాగితే రిలాక్స్‌ అవుతుంటారు.

3. రోజుని ప్రారంభించాలంటే వారికి అవసరమైన శక్తినిచ్చేది మంచి ఛాయ్‌ అని విశ్వసిస్తారు.

4. పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

5. ఇది నిశ్శబ్దంగా జీర్ణ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

6. ప్రపంచంలో మూడు వేల కంటే ఎక్కువ రకాల టీలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

7. ఎక్కువమంది ఇష్టపడే పానీయాలలో టీ మొదటి స్థానంలో ఉందని చాలా వరకు అధ్యయనాలు చెబుతున్నాయి.

8. ఎంత ఇష్టమైనా కూడా ఖాళీ పొట్టతో మాత్రం టీ సేవించవద్దని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

9. పరగడుపున టీ తాగడం వల్ల శరీరం ఎదుగుదలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

10. టీలో ఉండే టానిన్లు ఆహారం నుంచి ఇనుమును, ఇతర పోషకాలను గ్రహించడంలో అడ్డుపడతాయని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Juice for Liver: లివర్‌ ఆరోగ్యానికి ఎలాంటి జ్యూసులు తాగాలి..?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు