Sanathana Dharma: సనాతన ధర్మం (Sanathana Dharma) మీద, హిందూ దేవతలపై మీద దాడి చేసే సెక్యూలరిస్ట్ లకు అగ్రరాజ్యాల్లో ఉండే గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవని డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి వారాహి బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
’’మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా, ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలగా ప్రకటించుకుంటే.. మాది ఇస్లామిక్ రాజ్యం అని ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్ లకు అవేవీ కనిపించవు..తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లదేశ్ యుద్దంలో 3630 మంది దేశ సైనికులు చేనిపోయారు 9856 మంది గాయపడ్డారు.. 213 మంది ఆచూకీ ఈరోజుకి లేదు.. దానికి మనం విమోచన కల్పించి ఇస్లామిక్ దేశంగా అవతరించే సహాయం చేస్తే దానికి సూడో సెక్యులరిస్ట్ లు ఏం మాట్లాడరు..
అక్కడున్న హిందువులు దుర్గాపూజ చేసుకోకూడదు.. వారంరోజుల్లో వెళ్లిపోవాలి అంటే ఒక్క సూడో సెక్యులరిస్ట్ లు మాట్లాడరు.. ఎందుకంటే నోరు ఎత్తకూడదు.. నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి..మనం చెప్పావు అనుకోండి, మనం మాట్లాడకూడదు మన నోట్లు లాక్ చేయడానికి చట్టాలనే తాళాలు ఉన్నాయి.. మౌనంగా పళ్ల బిగువున బాధను సగటు భారతీయుడు అణుచుకుంటా భరించాలి.
దీనికి కారణాలు అనేకం ..మొదటిది సమాజంలో ఐక్యత లేకపోవడం.. కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండడం..పిరికితనాన్ని మంచితనాన్ని అనుకోవడం.. చెతకానితనానికి సహనం అని పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో మూలలక్షణాలు అయిపోయాయి’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Tirupati Varahi Sabha: ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదు
Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్
