Tuesday Sentiment: మన పెద్దలు చెబుతున్నట్లుగా శుక్రవారం రోజున చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. దీనిపై కొందరికి సిద్ధాంతం ఉంటుంది. శుక్రవారం రోజున ఇంట్లోని బూజులు దులపకూడదు. పూజా మందిరాలు శుభ్రం చేసి చెత్తా చెదారాన్ని బయట పడేయకూడదు. పాత సామాన్లు, పాత బట్టలు ఎవరికీ ఇవ్వకూడదు. చేతులకు గాజులు తీయకూడదు. పసుపు, కుంకుమ డబ్బాలు ఖాళీ చేయరాదు. పువ్వులు పారేయరాదు. పూజా పీఠాన్ని కదపరాదు. పుట్టింటి నుంచి ఆడపడుచులను అత్తారింటికి పంపరాదు. (Tuesday Sentiment)
మన ఇళ్లలో పెద్దలు మంగళవారం, శుక్రవారం కొన్ని పనులు చేయరాదని చెబుతుంటారు. ఇది పూర్వీకుల నుంచి వస్తోందని, అందువల్ల కొన్ని పనులు మానుకోవాలని చెబుతుంటారు. ఈ క్రమంలో అసలు ఆ రెండు వారాల్లో చేయకూడని పనులు, చేయదగిన పనులు ఏంటో ప్రత్యేకించి ఈ కాలంలో యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ విషయం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
ఇలాంటివన్నీ ఎందుకు చేయకూడదంటే లక్ష్మీదేవి శుక్రవారాన్ని ఆశ్రయించుకొని ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఆరోజు తలంటుకూడాపోసుకోరాదని చాలా మంది చెబుతుంటారు. లక్ష్మీదేవి అంటే అమ్మవారి స్వరూపంగా భావించరాదని, అభివృద్ధి, సిరిసంపదలుగా భావించాలని పెద్దలు చెబుతున్నారు. బియ్యపు సంచులు ఖాళీ చేయడం లాంటివి చేయరాదని చెబుతారు. ఇలా సంపద వెళ్లిపోతే ఇంటి అభివృద్ధి కూడా వెళ్లిపోతుందని నమ్ముతారు. దీనికి ఆధారాలు అంటే ఎవరికి వారు సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వారాల్లో ఒక్కో రోజుకు ఒక్కో అధిపతి ఉంటారు. శుక్రవారానికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇక మంగళవారం రోజు విషయానికి వస్తే.. కుజుడు అధిపతి. భూసంబంధం. భూమి పుత్రుడు. ఆయన కోపిష్టిగా చెబుతారు. ఆయనకు ప్రశాంత వ్యవహారాలే గానీ, పెద్ద వ్యవహారాలు చేస్తే దురుసుగా అవుతుందని చెబుతున్నారు. ఈ రోజు చేపట్టే పెద్ద కార్యక్రమాలను చేపట్టవద్దని సూచిస్తారు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో చీపుర్లు కొనరాదు. పాత చీపుర్లు పడేయరాదు. డబ్బులు, అప్పు ఇవ్వరాదు. కానీ, కొని తెచ్చుకోవచ్చని సూచిస్తున్నారు. హేర్ కటింగ్ చేయించుకోరాదు. గోళ్లు కట్ చేసుకోరాదని సూచిస్తున్నారు.
మంగళవారం రోజున ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే.. ఆ డబ్బు తిరిగి రాదని కూడా చెబుతుంటారు. మంగళవారం రోజు కొత్త బట్టలు ధరించకూడదు అనేది ఇంకొంతమందికి నమ్మకం ఉంటుంది. ప్రయాణాలకు మంగళవారం అనువు కాదని చెబుతుంటారు. అలా ప్రయాణాలు చేసి తలపెట్టే ఏ పనులు కూడా విజయవంతం కావనే భావన చాలా మందిలో ఉంటుంది. కొంతమంది మంగళవారం నాడు ఆంజనేయస్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటడటం జరుగుతుంటుంది. అలా ఒక్కపొద్దు ఉండి రాత్రి వేళ భోజనం చేసేటప్పుడు ఉప్పు వేసిన భోజనం చేయకూడదు అని పండితులు సూచిస్తున్నారు.
మంగళవారం తలస్నానం చేయకూడదని.. అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందనే చాలా మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తించుకోవడం లాంటివి చేసినా అశుభం జరుగుతుందని భావిస్తారు.
Read Also : Non Veg: మాంసాహారం ఏ రోజుల్లో తినాలి? మంగళవారం తింటే ఏం జరుగుతుంది?