Non Veg: చాలా మందికి వారంలో ఒకసారైనా నాన్‌వెజ్ (Non Veg) తినడం అలవాటుగా మారి ఉంటుంది. ప్రముఖంగా ఆదివారం ఎక్కువ మంది మాంసాహారం (Non Veg) తెచ్చుకొని తింటూ ఉంటారు. మంగళవారం లేదా బుధవారం కూడా చాలా మంది తింటూ ఉంటారు. అయితే, వారంలో ఒక్కోరోజు ఒక్కో దేవుడిని, దేవతను పూజించడం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతోంది. ఆ రోజుల్లో మూగజీవాలను చంపడం పాపం అని చాలా మంది చెబుతారు. పురాణాల్లోనూ జంతువధను మహాపాపంగా పేర్కొన్నారు.
మంగళవారాన్ని ఆంజనేయస్వామి వారంగా చెబుతారు. ఆరోజు హనుమంతుణ్ని పూజిస్తే సకల శుభాలుకలుగుతాయని ప్రతీతి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక కష్టాలు తీరాలంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని నిష్టతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. అయితే, చాలా మంది మంగళవారం రోజున చికెన్, మటన్ తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇలా చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఆంజనేయస్వామి ఆవేదన చెందుతాడని చెబుతున్నారు. ఆయన కోపగించుకుంటే తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు.
సాధారణంగా మంగళవారం ఏదైనా పని సంకల్పిస్తే అది ఆ తర్వాత కూడా కొనసాగుతుందని చెబుతారు. ఇది మాంసాహారం తినే వారికి కూడా వార్తిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. శనివారం మాంసం ఎలా తినకూడదని చెబుతారో అదే విధంగా మంగళవారం కూడా నాన్ వెజ్‌కి దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మరి ఆ రోజున నాన్ వెజ్ తింటే ఏమవుతుందని చాలా మంది ప్రశ్నిస్తుంటారు.
ఆంజనేయస్వామిని నిత్యం పూజించే వారికి ధైర్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవి కొనసాగాలంటే మంగళవారం నాన్‌వెజ్ మానేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయకపోతే పూజా ఫలం దక్కదని సూచిస్తున్నారు. వీలైనంత వరకు మంగళవారం నాన్‌వెజ్ జోలికి పోరాదని సూచిస్తున్నారు. నిష్టతో అంజనీపుత్రుడికి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయంటున్నారు. మాంసాహారం తింటే కుటుంబంలో సంతోషానికి బదులుగా దుఖం వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందాలంటే భక్తిపూర్వకంగా నిష్టతో పూజ చేయాలని సూచిస్తున్నారు.
పౌష్టికాహారంతోనే శారీరక దృఢత్వం..
పౌష్టికాహారమే శరీరాన్ని బలంగా ఉంచుతుంది. అలాగే మనసును ఆరోగ్యకరంగా ఉంచేందుకు వీలు కలుగుతుంది. భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోపాటు పోషకపదార్థాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కలగలిసిన భోజనమే అమృతంతో సమానంగా ఉంటుంది. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదై ఉండాలని డైటీషియన్లు కూడా చెబుతున్నారు. సమపాళ్లలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సమతుల ఆహారం తీసుకోవడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ మేరకు అనేక అధ్యయనాలు కూడా స్పస్టంగా చెబుతున్నాయి. మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును గమనించామని, అదే శాఖాహారం తీసుకున్నవారిలో అమైనో ఆమ్లం అధికంగా ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ అమైనో ఆమ్లం రక్తపోటును అరికడుతుంది. కాయగూరల్లో అమైనో ఆమ్లంతోపాటు మెగ్నీషియం కూడా ఉంటుంది.
ఇది రక్త పోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఫైబర్.. ధాన్యాల్లో అధికంగా లభిస్తుంది. పప్పులు, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్‌లలో అధికంగా లభ్యం అవుతుంది. ఇవి శరీర బరువును కూడా క్రమబద్దీకరిస్తాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం వచ్చేస్తుంది.
Read Also: Food: జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు ఇవే..