పచ్చని సంసారాలు కలకాలం వర్ధిల్లాలని వివాహం సందర్భంగా పండితులు ఆశీర్వదిస్తుంటారు. అయితే, సంసారంలో ఒడిదొడుకులు, ఈగోలు, ఆధిపత్యం, ఇతర కారణాల వల్ల చాలా జంటలు మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతుంటాయి. కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకుంటారు. ఈ సందర్భంలోనూ కోర్టులో న్యాయమూర్తి ఇద్దరికీ ఆరు నెలలు గడువు ఇచ్చి పంపుతారు. అప్పటికీ రాజీకి రాకపోతే విడాకులు మంజూరు చేస్తారు. తాజాగా విడాకుల మంజూరు అంశపై దేశ అత్యున్నత ధర్మాసనం (SC On Divorce) కీలక తీర్పు ఇచ్చింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి తక్షణమే విడాకులు ఇవ్వొచ్చని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం (SC On Divorce) స్పష్టం చేసింది.
పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలని అనుకుంటే అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరమే లేదని స్పష్టీకరించింది. కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సుప్రీంకోర్టు సడలించింది. దంపతుల మధ్య వివాహ బంధం (Marriage) కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం కోర్టుకు సాధ్యమేనని ధర్మాసనం తెలిపింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను వినియోగించుకొని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) అలాంటి వారికి డైవోర్స్ మంజూరు చేయొచ్చని స్పష్టం చేసింది.
దంపతులు ఒకరికి ఒకరు ఆమోదయోగ్యంగా అంగీకారంతో విడిపోవాలని భావిస్తే అందు కోసం ఆరు మాసాలు వెయిట్ చేయాల్సిన పని లేదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తి వేయవచ్చని జస్టిస్ ఎస్.కే. కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పును ప్రకటించింది.
ఫ్యామిలీ కోర్టులకు (Family Court) రిఫర్ చేయకుండానే అత్యున్నత ధర్మాసనం డైరెక్ట్‌గా డైవోర్స్ మంజూరు చేసే విషయమై సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇద్దరూ పరస్పరం ఇష్టపూర్వకంగా డైవోర్స్ కోరుకొనే జంటల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను ఉపయోగించేందుకు వీలు కలుగుతుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది. 2016 జూన్ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. గతేడాది సెప్టెంబర్‌లో తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. ఈ తీర్పును సోమవారం వెలువరించింది.
ఏది ఏమైనప్పటికీ దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది చాలా ముఖ్యం. బంధంలో సంఘర్షణలు సాధారణమే. అయితే వాటిని దాటుకొని మంచి జీవితాన్ని ఆస్వాదించడం అలవర్చుకోవాలి. కొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సందర్భాలు పెరిగి పెద్దవై విడిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్లిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బంధం విచ్ఛిన్నం అవుతుంటుంది. అలా కాకుండా జాగ్రత్తలు పాటించాలి.
దంపతుల మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి భాగస్వామితో ప్రతి రోజూ ఎంతో కొంత సమయం మాట్లాడుతూ ఉండాలి. కొన్ని విషయాల్లో అయినా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇద్దరికీ ఉన్న సమస్యలను గానీ, మీకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యల్ని గానీ వారితో పంచుకుంటూ ఉండాలి. వారి మాట కూడా వింటూ ఉండాలి. ఇలా చేస్తే బంధం విచ్చిన్నం కాకుండా ఉంటుంది.
Read Also : Marriage Dates : ఈనెలలో మంచి రోజులు.. పెళ్లి ముహూర్తాల శుభ తేదీలు ఇవే..