PSLV C- 56 : పీఎస్‌ఎల్‌వీ – 56 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 7 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపుతోంది. ఈ నెలలో ఇస్రో కు ఇది రెండో ప్రయోగం కావడం గమనార్హం. ప్రైమరీ పేలోడ్ ద్వారా కక్ష్యలోకి DS – SAR ఉపగ్రహం చేరేలా ప్రయోగం చేశారు. పీఎస్‌ఎల్‌వీ – 56 తో నింగిలోకి మరో ఆరు చిన్న ఉపగ్రహాలు వెళ్తున్నాయి. సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్తోంది. PSLV C- 56 రాకెట్ మూడో దశ విజయవంతం అయ్యింది. మొత్తం నాలుగు దశల్లో ప్రయోగం నిర్వహించారు. (PSLV C- 56)
Read Also : Tirumala Samacharam 30-07-2023: తిరుమలలో హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం..
ఒకే నెలలో 2 ప్రయోగాలను ఇస్రో విజయవంతం చేయడం విశేషం. PSLV సిరీస్ లో ఇది 58 వ ప్రయోగం. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమనాధ్ అభినందనలు తెలియజేశారు. నిర్దేశించిన కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టామని సోమనాథ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ లో మరో PSLV ప్రయోగం చేపడతామని ఆయన వెల్లడించారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ ప్రయోగమని ఇస్రో చైర్మన్ సోమనాధ్ ప్రకటించారు.
PSLV C- 56 ప్రయోగం విజయవంతంపై సీఎం జగన్ అభినందనలు..
ఏడు ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో బృందానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Read Also : Chandrayaan 3 : చంద్రయాన్ – 3 సక్సెస్.. మామా వచ్చేస్తున్నామంటున్న ఇస్రో.. అంబరమంటిన సంబరాలు..