Chandrayaan 3 : చంద్రయాన్‌ – 3 సక్సెస్‌.. మామా వచ్చేస్తున్నామంటున్న ఇస్రో.. అంబరమంటిన సంబరాలు..

Chandrayaan 3 : ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రయోగం చంద్రయాన్ – 3 విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్ – 2 నుంచి చంద్రయాన్ – 3 ని MLV3 M4 రాకెట్ మోసుకెళ్లింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్ – 3. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఎల్ వీఎం- 3ఎం – 4 రాకెట్ ప్రయోగం జరిగింది. చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. (Chandrayaan 3)

Image

చంద్రయాన్ – 3 విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లింది. భూ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ – 3.. 24 రోజుల పాటు భూ కక్ష్యలోనే తిరగనుంది. 24 రోజుల తర్వాత చంద్రుని వైపు పయనం అవుతుందని ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. ఆగష్టు 23 లేదా 24 న చంద్రుడి పై ల్యాండింగ్ అయ్యే చాన్స్‌ ఉంది. ఇస్రో లో శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సంబరాలు అంబరమంటేలా చేసుకున్నారు.

Image

Read Also : Tirumala que: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి రాకెట్‌ దూసుకెళ్లింది. సరికొత్త టెక్నాలజీతో చంద్రయాన్ -3 ప్రయోగం చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అవనున్న చంద్రయాన్ -3.. జాబిలిపై ఎవరూ చేరుకోని దక్షిణ ధ్రువానికి వెళ్లనుంది. ప్రయోగం విజయవంతమైందని, త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామని ఇస్రో చైర్మన్ సోమనాధ్ వెల్లడించారు.

Read Also : Telangana News: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles