Tirumala Samacharam 30-07-2023: తిరుమల శ్రీవారి చెంత భక్తుల తాకిడి సాధారణంగా కొనసాగుతోంది. భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చింది. అలాగే నిన్న శ్రీనివాసుడిని 78,115 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 38,243 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. (Tirumala Samacharam 30-07-2023)
శ్రీవారి ఆలయంలో స్టీల్ హుండీలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి చెంత స్టీలు హుండీలు ఏర్పాటు చేస్తోంది టీటీడీ. శ్రీవారి ఆలయంలోకి 5 అడుగుల స్టీల్ హుండీని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. తిరుమలలో హుండీల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కొప్పెరలో పెద్ద పెద్ద గంగాళాలు ఉంచి అందులో భక్తులు కానుకలు వేసేలా హుండీలు, ఇత్తడి హుండీలను ఏర్పాటు చేశారు. వీటటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ట్రాలీల్లో ఆలయం నుంచి వెలుపలకు, అక్కడి నుంచి పరకామణికి లారీల్లో తరలిస్తున్నారు. ఇటీవల హుండీల తరలింపు సందర్భంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
హుండీల్లో భక్తులు వేసే కానుకలను కొందరు చేయి పెట్టిలాగేస్తున్నారని కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న స్టీల్ హుండీల ద్వారా భక్తులు పూర్తిగా చేయి పెట్టడానికి వీలు కాదు. మధ్యలో ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసి సులువుగా ఉందనిపిస్తే మరిన్ని స్టీల్ హుండీలు ఏర్పాటు చేసే దిశగా టీటీడీ అధికారులు ఆలోచన చేస్తున్నారు.
శ్రీకాళహస్తిలో నిత్య కళ్యాణం టికెట్ ధర పెంపు
శ్రీకాళహస్తి పరమేశ్వరుడి సన్నిధిలో నిత్య కల్యాణం టికెట్ ధర పెంచారు. నిత్య కళ్యాణం టికెట్ ను రూ.516 నుంచి రూ.1,116లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన టికెట్ ధర వచ్చే నెల 1 నుంచి అమలవుతుందని ఆలయ ఈవో వెల్లడించారు.
Read Also : Retirement Age: వర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు పెంపు