Vijayasai Reddy on CBN: నూతన పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిన్న ప్రారంభం అయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న క్రమంలో వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంటులో మాట్లాడారు. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. బాబు అరెస్టుపైనా పార్లమెంటులో ప్రస్తావన వచ్చింది. (Vijayasai Reddy on CBN)
పాత పార్లమెంటు భవనంలో చివరి సమావేశాల సందర్భంగా ప్రధాని భావేద్వేగమైన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఏపీ ప్రతిపక్ష నేత అరెస్టుపై టీడీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు.. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ సభ దృష్టికి తెచ్చారు. అనంతరం వైయస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దీనిపై కౌంటర్ ఇచ్చారు. మధ్యలో జోక్యం చేసుకోగా కూర్చోవాలంటూ హెచ్చరించారు. దీనిపై టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేసింది. అహంకారంతో మిథున్‌రెడ్డి వ్యవహరించారంటూ వాపోయింది.
తర్వాత రాజ్యసభలోనూ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై సెటైర్లు వేశారు. కంప్యూటర్, సెల్‌ఫోన్‌ను తానే కనుగొన్నానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారన్నారని.. అదే నిజమైతే వాటి పేటెంట్ హక్కుల కోసం కేంద్రం ప్రయత్నించాలని సూచించారు. ఈ పరిణామంతో తోటి ఎంపీలంతా నవ్వుకున్నారు. అయితే, బీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు మాత్రం విజయసాయిరెడ్డి స్పీచ్‌ను అడ్డుకోవడం గమనార్హం. టీడీపీ ఎంపీలకే పట్టలేదు, కేకే ఎందుకు జోక్యం చేసుకున్నారో అర్థం కాక అందరూ తల పట్టుకున్నారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ, మిస్టర్ కేకే.. ప్లీజ్ సిట్‌డౌన్.. అంటూ హెచ్చరించారు. అనంతరం తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు.
చంద్రయాన్ విజయంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. అన్నీ నేనే కనిపెట్టానంటూ చెప్పుకుంటున్న బాబుకు ఓ రేంజ్‌లో చురకలంటించారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను గురువు అంటారు. అంతరిక్ష పరిశోధనలకు నాంది నేనే పలికాను అంటారు. చంద్రబాబు కనిపెట్టిన వస్తువులకు పేటెంట్ తీసుకుంటే భారత్‌కు కోట్లలో ఆదాయం గ్యారంటీ’. అంటూ బాబుపై సాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు.