AP Students in UN: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు కొందరు చదువుకున్న మూర్ఖులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. దానికి ప్రతిగా.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అది కూడా ఐక్యరాజ్య సమితి వేదికపై ఏపీ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్థులు తమ సత్తా చాటారు. ట్రోలింగ్ నుంచి హ్యాట్సాఫ్ దాకా వారి ప్రస్థానం ఎలా కొనసాగుతోందో, ఏపీ ప్రభుత్వ బడుల్లో ఏరకంగా చదువుల విప్లవం వర్ధిల్లుతోందో ఈ కథనంలో చూద్దాం.. (AP Students in UN)
మై నేమ్ ఈజ్ మేఘన సర్.. అంటూ బెండపూడి ప్రభుత్వ బడిలోచదువుతున్న బాలిక సీఎం జగన్ వద్ద ఇంగ్లీషులో మాట్లాడింది. దీనిపై సోషల్ మీడియాలో భావదరిద్రులు కొందరు ఏకమయ్యారు. ఐయామ్ ఫ్రం బెండపూడి… ట్యాగ్ దట్ మ్యాఘనా… ఒక్కసారి మై నేమ్ ఈజ్ మ్యాఘనా… అనమ్మా… అంటూ పిచ్చి చేష్టలు, వెకిలి కామెంట్లతో రెచ్చిపోయారు. సీఎం జగన్‌పై అణువణువునా ద్వేషం నింపుకున్న వారంతా ఇంగ్లీషులో మాట్లాడుతున్న పిల్లలను టార్గెట్ చేశారు. తీవ్రమైన అవమానాలకు గురి చేశారు. ఇదంతా తట్టుకోలేక ఆ పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
పేదరికాన్ని, అమాయకత్వాన్ని దాటుకొని మారుమూల పల్లెల్లోని గవర్నమెంట్ బడుల్లో చదువుకుంటూ, తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన ఆ పిల్లల్లో ఈ ట్రోలింగ్ మరింత పట్టుదలను పెంచింది. అవమానాలను దాటుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా వారు కష్టపడి చదువుతున్నారు. అందుకు నిదర్శనమే నేడు అంతర్జాతీయ యవనికపై ఏపీ ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు అడుగు పెట్టడం. ద్వేషం, అసూయలను ప్రేమతో గెలిచి, నేడు ఐక్యరాజ్య సమితి లాంటి అత్యున్నత ప్రపంచ వేదిక మీద సగర్వంగా తలెత్తుకొని అదే ట్రోల్ చేసిన ఇంగ్లీషులో మాట్లాడుతూ, భావదరిద్రుల చెంప చెళ్లుమనిపించేలా చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 – 28) పర్యటిస్తున్నారు. ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానం పలికారు.
న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యాక్షన్ ప్యాక్డ్ ఎస్‌డీజీ (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్) సమ్మిట్‌లో ఈ విద్యార్థులు భాగం అవుతున్నారు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి యూఎన్‌లో వీరు మాట్లాడనున్నారు. ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలపై వివరించనున్నారు. ప్రత్యేక ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు.
https://x.com/BotchaBSN/status/1703447034425172131?s=20
విద్యారంగంలో జగన్ తెచ్చిన మార్పులు ఇవీ..
రాష్ట్రంలో ప్రభుత్వ బడులు, చదువులను సమూలంగా మారుస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. అధికారం చేపట్టిన నాటి నుంచే నాడు-నేడు పేరుతో సర్కారు బడుల రూపురేఖలు మారుస్తున్నారు. రోజుకో మెనూతో మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్నారు. విద్యారంగంపై, పిల్లల చదువులపై ఎంత ఖర్చుకైనా సీఎం వెనుకాడటం లేదు. చదువుల విప్లవం ఎలా ఉందో తెలిపేందుకు ఇవీ ఉదాహరణలు..
- ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌లో ఇంకా బాగుండాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని జగన్ చెబుతుంటారు.
- ప్రతి అడుగూ కూడా ప్రతి పిల్లాడినీ చేయి పట్టుకొని పెద్ద చదువులు చదివించి తద్వారా పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నామంటుంటారు.
- 17-20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని జీవిత ప్రమాణాన్ని ఈ రెంటింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మినట్లు ఆయన చెబుతుంటారు.
- ప్రతి పేద కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఫీజులు పూర్తిగా తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన.
- భోజనం, వసతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన తీసుకొచ్చారు.
- ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ పిల్లాడికి రూ.15 వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ పిల్లలకు సంవత్సరానికి రూ.20 వేల చొప్పున పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు.
- జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.4,275 కోట్లు పెద్ద చదువుల కోసం తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు
- జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా నాలుగేళ్లలోనే రూ.15,600 కోట్లు అందించారు.
- పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ బడికి పంపితే చాలు తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి ఇస్తున్నారు.
- ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగులు, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ అన్నీ కలిపి విద్యా కానుకగా స్కూల్ తెరిచే రోజు ఇస్తున్నారు.
- స్కూళ్లను సమూలంగా రూపు రేఖలు మారుస్తూ, శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు గొప్ప వైభవం తీసుకొచ్చేందుకు నాడు-నేడు అమలు చేస్తున్నారు.
- గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్ బుక్ లు తీసుకొచ్చారు.
- బైజూస్ కంటెంట్‌ను కూడా పిల్లల కరిక్యులమ్ ను అనుసంధానం చేశారు.
- 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
- మూడో తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ బోధన ప్రారంభానికి సన్నాహాలు చేశారు.
- సీబీఎస్ఈ సిలబస్‌తో ప్రారంభించి ఐబీ, ఐజీసీఎస్ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ దిశగా గవర్నమెంట్ బడులు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
- నాడు-నేడు కింద పూర్తి అయిన బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములు డిజిటలైజ్ చేస్తున్నారు.
- ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 63 వేల క్లాస్ రూములకు సంబంధించి 31 వేల క్లాస్ రూముల్లో ఏర్పాటయ్యాయి.
- 8వ తరగతి పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా ట్యాబ్స్ ఇస్తున్నారు.
- గవర్నమెంట్ స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద అమలు.
- సంపూర్ణ పోషణ, స్కూళ్లలో ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ తీసుకొచ్చారు.
- చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే 10 పాసై ఉండాలనే నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు.
- ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలని పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన అమలు.
- ఇలాంటి పథకాలపై జగన్ ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది.
ఇదీ చదవండి: CM Jagan Rayalaseema tour: సీఎం జగన్ రాయలసీమ పర్యటన.. 19న లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభం