iPhone 18 Pro Max: iPhone 18 Pro Maxలో యాపిల్ ప్రత్యేకమైన బ్యాటరీ ఫర్మ్‌వేర్ సొల్యూషన్‌ను తీసుకొచ్చింది. ఈ మోడల్ బ్యాటరీ సామర్థ్యం 20 వాట్-అవర్స్ (Wh) కంటే ఎక్కువగా ఉండటంతో, పలు దేశాలు, ప్రాంతాల్లో వర్తించే షిప్పింగ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం Prepare to Ship అనే ప్రత్యేక ఆప్షన్‌ను సెట్టింగ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. Apple Support
20 Wh దాటితే ఎందుకు?
iPhone 18 Pro Maxలో సింగిల్-సెల్ బ్యాటరీ సామర్థ్యాన్ని 20 Whకు మించి పెంచినట్లు యాపిల్ వెల్లడించింది. 20 Wh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సింగిల్-సెల్ బ్యాటరీలతో కూడిన పరికరాలకు చాలా దేశాలు, ప్రాంతాల్లో అదనపు షిప్పింగ్ నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనలను పాటించేందుకు యాపిల్ బ్యాటరీ ఫర్మ్‌వేర్ ఆధారిత విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోన్ తయారైనప్పటి నుంచి ఫ్యాక్టరీ నుంచి కస్టమర్‌కు చేరే వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని 20 Wh కంటే తక్కువగా పరిమితం చేస్తుంది. ఐఫోన్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత ఈ పరిమితి తొలగిపోతుంది. అప్పుడు బ్యాటరీ పూర్తి ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
Prepare to Ship అంటే ఏమిటి?
ఐఫోన్‌ను ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత రిపేర్ కోసం పంపినా, ట్రేడ్-ఇన్ చేసినా, రిటర్న్ చేసినా లేదా మరొకరికి అమ్మినా, సాధారణ షిప్పింగ్‌కు ముందు Prepare to Ship ఫీచర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేసినప్పుడు ఐఫోన్ బ్యాటరీని 20 Wh కంటే తక్కువ స్థాయికి డిశ్చార్జ్ చేస్తుంది. ఆ తర్వాత ఛార్జింగ్ పరిమితిని సెట్ చేసి, షిప్పింగ్ సమయంలో బ్యాటరీ మళ్లీ 20 Wh స్థాయిని దాటకుండా చూస్తుంది.
సెట్టింగ్స్‌లో ఇలా చేయాలి
iPhone 18 Pro Maxలో Settings → General → Transfer or Reset iPhone → Prepare to Ship మార్గంలోకి వెళ్లాలి. రిపేర్, ట్రేడ్-ఇన్ లేదా రిటర్న్ కోసం పంపుతున్నట్లయితే సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మరొక వ్యక్తికి అమ్మడం లేదా బహుమతిగా ఇవ్వడం వంటి సందర్భాల్లో Other ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించి ప్రక్రియను పూర్తి చేయాలి. బ్యాటరీ డిశ్చార్జ్‌కు సమయం
Prepare to Ship ప్రక్రియ పూర్తయ్యే ముందు ఐఫోన్ బ్యాటరీని కొంత మేర డిశ్చార్జ్ చేయాల్సి రావచ్చు. బ్యాటరీ డిశ్చార్జ్ అవుతున్న సమయంలో ఫోన్ సాధారణం కంటే కొంచెం వేడిగా అనిపించవచ్చని యాపిల్ చెబుతోంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫోన్ తిరిగి చల్లబడుతుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటే ఈ ప్రక్రియకు రెండు గంటల వరకు పట్టవచ్చు. బ్యాటరీ ఇప్పటికే తక్కువ స్థాయిలో ఉంటే కొన్ని నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రక్రియ జరుగుతున్న సమయంలో సాధారణంగా ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ముందుగానే ఫోన్‌ను ఎరేజ్ చేస్తే, బ్యాటరీ డిశ్చార్జ్ అవుతున్న సమయంలో దాన్ని ఉపయోగించలేరు. ప్రక్రియ పూర్తయిన తర్వాత Settingsలో Ready to Ship అనే స్టేటస్ రెడ్ బ్యాడ్జ్‌తో కనిపిస్తుంది. అదే షిప్పింగ్‌కు సిద్ధమైనట్లు సూచిస్తుంది.
కొత్త ఫోన్‌కు అవసరం లేదు
కొత్తగా కొనుగోలు చేసిన iPhone 18 Pro Max ఇంకా యాక్టివేట్ చేయకపోయినా, బాక్స్ నుంచి బయటకు తీయకపోయినా Prepare to Ship ఆప్షన్‌ను ప్రత్యేకంగా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీ నుంచి రవాణా చేసే దశలోనే బ్యాటరీ సామర్థ్యం 20 Wh కంటే తక్కువగా పరిమితం చేసి ఉంటుంది. అంటే కొత్త ఐఫోన్‌ను స్టోర్ నుంచి ఇంటికి తీసుకెళ్లేటప్పుడు లేదా సాధారణంగా ప్రయాణించేటప్పుడు యూజర్ ప్రత్యేకంగా ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయాల్సిన అవసరం లేదు.
ప్రయాణానికి ఇది అవసరం కాదు
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. Prepare to Ship ఫీచర్ సాధారణ విమాన ప్రయాణం కోసం కాదు. యాపిల్ ప్రకారం iPhone 18 Pro Max బ్యాటరీ షిప్పింగ్, విమాన ప్రయాణానికి సురక్షితంగానే ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రధానంగా షిప్పింగ్ నిబంధనలను పాటించేందుకు రూపొందించబడింది. ఇతర ఐఫోన్ మోడళ్లకు కూడా ఈ విధానం అవసరం లేదు.
మళ్లీ పూర్తి బ్యాటరీ సామర్థ్యం ఎలా?
షిప్పింగ్ కోసం Prepare to Shipను ఆన్ చేసిన తర్వాత అవసరమైతే దాన్ని తిరిగి మార్చుకోవచ్చు. రిపేర్, ట్రేడ్-ఇన్ లేదా రిటర్న్ కోసం ఈ ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు ఛార్జింగ్ పరిమితి 14 రోజుల పాటు 80 శాతానికి సెట్ అవుతుంది. ఆ తర్వాత Prepare to Shipను డిసేబుల్ చేసి పూర్తి ఛార్జింగ్‌ను తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇతర కారణాలతో Prepare to Shipను ఉపయోగించినట్లయితే, Settingsలోకి వెళ్లి Ready to Ship → Undo Shipping Preparation ద్వారా దాన్ని రద్దు చేసుకోవచ్చు. అనంతరం Settings → Battery → Chargingలోకి వెళ్లి ఛార్జింగ్ పరిమితిని మార్చుకోవచ్చు.
ఈ విధంగా iPhone 18 Pro Maxలో పెరిగిన బ్యాటరీ సామర్థ్యాన్ని వినియోగదారులకు అందిస్తూనే, షిప్పింగ్ సమయంలో వర్తించే బ్యాటరీ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా యాపిల్ కొత్త ఫర్మ్‌వేర్ ఆధారిత విధానాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా రిపేర్, ట్రేడ్-ఇన్, రిటర్న్ లేదా మరొకరికి ఫోన్ పంపించే సమయంలో Prepare to Ship ఆప్షన్‌ను ఉపయోగించడం ఈ మోడల్ యూజర్లకు కొత్త ప్రక్రియగా మారింది.
Read also: Apple Watch Series 12: కొత్త హెల్త్ సెన్సర్లు, AI ఫీచర్లతో వేర్‌బుల్ టెక్నాలజీలో కొత్త అడుగు
Apple: మళ్లీ ఆ జోష్.. ఫోల్డబుల్ iPhoneతో కొత్త సంచలనం! ఇక ఈ స్టాక్ కొనొచ్చా?
Apple: కొత్త శకం.. iPhone 18 Proతోనే ఎంట్రీ, $1,999కి ఫోల్డబుల్ iPhone Duo.. అసలు ప్లాన్ ఇదే!






