Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..

Janhvi Kapoor: అతిలోక సుందరి.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని చాలా కష్టాలు పడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు చాలా కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది.

సినిమాల్లో రాణించడం ఒక ఎత్తు.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించడం మరో ఎత్తు. స్టార్ డమ్ తో పాటు కఠిన శ్రమ అవసరం. శ్రీదేవి కూతురిగా జాన్వీ (Janhvi Kapoor) ఆదరించాలంటే కాస్త కష్టమే.

సొంత ట్యాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటానంటూ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా సందర్భాల్లో చెబుతూ వస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ అంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నటన పరంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది.

కొన్ని పాత్రలు అవలీలగా ఉంటాయి. కానీ కొన్ని కష్టతరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ ఓ ఛాలెంజింగ్ రోల్ చేసింది. జాన్వీ కపూర్‌ నటించిన మిలీ సినిమాలో మైనస్ 16 డిగ్రీల్లో ఇరుక్కుపోయినట్లుగా నటించాల్సి వచ్చింది. ఇందుకోసం తాను ఏడున్నర కిలోల బరువు తగ్గిందట.

మళయాలంలో సూపర్ హిట్ కొట్టిన హెలెన్ సినిమాకు ఈ మూవీ రీమేక్ గా రూపొందించారు. ముత్తుకుట్టి జేవీఆర్ దర్శకత్వం వహించిన మిలీ మూవీ.. గతేడాది నవంబర్ 4న ఈ రిలీజ్ అయ్యింది.

జాన్వీ కపూర్ స్వతహాగానే కష్టపడే మనస్తతత్వం కలిగినది. షూటింగ్ సందర్భంగా తాను పడిన కష్టాలను చాలా సార్లు చెప్పింది. శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పింది.

మైనస్ డిగ్రీల చలిలో ఫ్రిజ్ లో ఉన్నట్లు నటించిన సీన్లు అయితే ఏకంగా నిద్రపోతుండగా కలలో కూడా వచ్చేవని తెలిపింది. నిద్ర పట్టేది కాదని వాపోయింది.

ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెప్పింది. దాదాపు మూడు రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వచ్చిందని తెలిపింది. డైరెక్టర్ ఆరోగ్యం కూడా దెబ్బ తినిందని, ఇలా కష్టపడ్డాం అని చెప్పుకొచ్చింది. ఫలితం తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది.

ఇక ఎన్టీఆర్‌ (NTR), కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా NTR 30 చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ.. జాన్వీ కపూర్‌ కూడా నటిస్తోంది.

జాన్వీ పుట్టిన రోజు సందర్బంగా మార్చి 6న చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఎన్టీఆర్ చిత్రంలో తనకు నటించాలని ఉందని అనేక ఇంటర్వ్యూల్లో జాన్వీ కపూర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రంలో జాన్వీ కపూర్‌కు అవకాశం దక్కడంతో అభిమానులు ఖుషీఖుషీగా ఉన్నారు.

ఈ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగు పెడుతుండడం విశేషం. ఆమె ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం మొన్నామధ్యనే పోస్టర్‌ రూపంలో విడుదల చేసింది. జాన్వీ కపూర్‌ ఫస్ట్‌ లుక్‌ అభిమానులను అలరించింది. ఆ పోస్టర్‌లో చీరతో అభిమానుల మనుసు దోచుకుంటోంది జాన్వీ.

Read Also : Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles