టాలీవుడ్‌లో (Tollywood) ఇండస్ట్రీ హిట్ మూవీస్ (Hit Movies) చాలా వచ్చాయి. వీటిలో బాక్సీఫీసు (Box Office) బద్దలు కొట్టిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక బాహుబలి (Bahubali) మూవీ తర్వాత నాన్ బాహుబలి రికార్డులు అనే పదం కూడా వాడుకలోకి వచ్చి చేరింది. స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఉండే కోలాహలం వేరుగా ఉంటుంది. టీవీల్లో ప్రసారం సందర్భంగా టీఆర్పీ (TRP Rating) రేటింగ్‌లోనూ రికార్డులు నెలకొల్పుతుంటారు. శాటిలైట్ హక్కులు పొందిన తర్వాత టీఆర్పీ (TRP Rating) రికార్డులపై కూడా లెక్కలోకి తీసుకొనేవారు ఉంటారు.
ఇక రాజమౌళి (SS Rajamouli) లాంటి దర్శక ధీరులు తీసే మూవీస్ కంపల్సరీ హిట్ అవ్వాల్సిందే. ఇక సినిమా థియేటర్లో హిట్ కొట్టే మూవీస్ గురించి పక్కన పెడితే.. శాటిలైట్ హక్కులు పొంది.. టీవీల్లో ప్రసారమై టీఆర్పీలో దూసుకెళ్లే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్పీ రేటింగ్ లో దుమ్ము దులిపిన మూవీస్ గురించి ఈ కథనంలో తెలుసుకోండి..
అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ అల వైకుంఠపురం (Ala Vaikuntapuram). ఈ మూవీకి టీఆర్పీ రేటింగ్ 29.40గా నమోదైంది. రీసెంట్ గా ఇదే ఇప్పటి వరకు హయ్యస్ట్ కావడం విశేషం. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు తర్వాత స్థానంలో నిలిచింది. సరిలేరు నీకెవ్వరు మూవీ టీఆర్పీ రేటింగ్ 23.40గా నమోదైంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రెపరెపలాడేలా చేసిన చిత్రం బాహుబలి. ఈ మూవీకి టీఆర్పీ రేటింగ్ కాస్త తక్కువగానే వచ్చింది. బాహుబలి2కి టీఆర్పీ రేటింగ్ 22.70గా నమోదైంది.
మహేష్ బాబు నటించిన మరో మూవీ శ్రీమంతుడు. ఈ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చింది. థియేటర్లలో హిట్ సాధించి మంచి కలెక్షన్లు రాబట్టింది. టీఆర్పీలో 22.54గా నమోదైంది. ఇక అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. ఈ మూవీ టీఆర్పీ రేటింగ్ 22.50గా ఉంది. బన్నీ మరో చిత్రం డీజే కూడా టీఆర్పీలో సత్తా చాటింది. 21.70గా నమోదైంది. ఇక బాహుబలి ది బిగినింగ్ మూవీకి టీఆర్పీ రేటింగ్ 21.54గా ఉంది. ఇక ఫిదా 21.31, గీతాగోవిందం 20.80, జనతా గ్యారేజ్ 20.69 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్నాయి.
Heroine: అర్ధరాత్రి చాటింగ్ బాగోతంపై హీరో మీద హీరోయిన్ ఆగ్రహం!
బెంగాలీ నటి విషయంలో చోటుచేసుకున్న ఓ మ్యాటర్.. ఈ మధ్య పబ్లిక్ లోకి వచ్చి సోషల్ మీడియాకు ఎక్కింది. కొందరు సెలబ్రిటీలు కాస్త గుట్టుగా వ్యవహారాలు నడుపుతుంటారు. అయితే, ఇందుకు భిన్నంగా మరికొందరు వ్యవహరిస్తుంటారు. వ్యక్తిగత విషయాలపై రచ్చకెక్కి ఇష్యూ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనే బెంగాలీ నటి విషయంలో జరిగింది.
మొన్నామధ్య దమాల్ అనే పీరియాడికల్ మూవీ రిలీజైంది. అందులో బిద్య సిన్హా సాహా మిమ్ హీరోయిన్. సియామ్ అహ్మద్ కథానాయకుడు. సినిమాలో నటించడం వరకు బాగానే ఉన్నా.. వీరి వ్యవహారం కాస్తా రచ్చకెక్కడానికి కారణం.. సియామ్ అహ్మద్ సతీమణి పొరి మొని. హీరో, హీరోయిన్లు కాస్త క్లోజ్ గా మెలగడంతో హీరో భార్యకు ఇది నచ్చలేదు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో రచ్చకెక్కింది. హీరోయిన్ ను ఉద్దేశించి.. నీ భర్తతో కలిసి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించు… అంటూ ఘాటు పోస్టు పెట్టింది.
స్పందించిన హీరోయిన్.. తన విక్టరీని చూసి ఓర్వలేక కొందరు కుళ్లుకుంటున్నారు… అంటూ పోస్టు పెట్టింది. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన పొరిమొని.. ఇక తన తడాఖా చూపించింది. చాంతాడంత పోస్టుతో విరుచుకుపడింది. తన సంసారంలో జరుగుతున్న గొడవను వీధికి ఈడ్చుకుంది. నేరుగా బిద్య సిన్హా సాహా మిమ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
హీరోయిన్ పోస్టుపై హీరో భార్య తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియాలో పెద్ద పోస్టు పెట్టింది. అందులో… నీ విజయాన్నిచూసి కుళ్లుకుంటున్నానా? ఈ మాటలను నువ్వు ఎలా అనగలుగుతున్నావు? పోరన్ మూవీలో నువ్వు, నా భర్త కలిసి బాగా నటించారని నేనే మెచ్చుకున్నా కదా.. నీ తల్లికి కూడా ఈ మాట చెప్పా కదా.. అప్పుడే మర్చిపోయావా? అంటూ ఫైర్ అయ్యింది.
మీరు లైన్ క్రాస్ చేస్తున్నారు. మీరిద్దరి బాగోతం వల్ల నా జీవితం సర్వనాశనమవుతోంది. అంటూ ఫైర్ అయ్యింది. ఇక భర్తపై కూడా ఆమె నిప్పులు చెరిగింది. నువ్వు దమాల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నావు.. అది అడ్డు పెట్టుకొని రాత్రి పూట మీరిద్దరూ ఫోన్లు చేసుకోవడం, చాటింగులు చేయడం లాంటి చర్యలతు నా బతుకుతో ఆడుకోవద్దు. ఈ చర్యలు తక్షణమే ఆపేయండి అంటూ సుదీర్ఘ పోస్టులో ఆమె పేర్కొనడం గమనార్హం.
Read Also : Vijay Devarakonda: బ్రహ్మాస్త్ర పార్ట్2లో కీ రోల్ చేయనున్న విజయ దేవరకొండ!