Vijay Devarakonda: బ్రహ్మాస్త్ర పార్ట్‌2లో కీ రోల్ చేయనున్న విజయ దేవరకొండ!

రౌడీ బాయ్.. అర్జున్ రెడ్డి ఫేమ్.. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మొన్నామధ్య లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, అంతకు ముందు అర్జున్ రెడ్డి మూవీతో ఆలిండియా లెవల్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పేరు మార్మోగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. కేవలం 5 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. 2017లో ఏకంగా 50 కోట్ల వరకు వసూలు చేసింది. అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

అర్జున్ రెడ్డి తర్వాత కమిట్ మెంట్ మూవీలు ఉండడంతో ఇక్కడే చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి విజయ్ దేవరకొండకు. అయితే, ఈలోగా వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లతో భారీ డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు విజయ్. ఇవి మర్చిపోయేలోగా లైగర్ ఏకంగా మర్చిపోలేని స్థాయిలో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో విజయ్ ఊహించిన బాలీవుడ్ రేంజ్ కాస్తా అధ:పాతాళానికి చేరినట్లు అయ్యింది. అయితే, భారీ బ్లాక్ బస్టర్ మూవీ వస్తే ఆకాశానికి ఎత్తేయడం, డిజాస్టర్లు వచ్చినప్పుడు అంతే స్థాయిలో ట్రోలింగ్ చేయడం టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయిన కామనే.

సాధారణ యువకుడిగా ఉన్న విజయ్ లైఫ్ స్టైల్ ను ఏకంగా సెలబ్రిటీ స్థాయికి చేర్చింది అర్జున్ రెడ్డి మూవీ. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ గా మూవీలు చేయడం ఒక్కటే మిగిలిందన్న తీరులో విజయ్ దేవరకొండ వెలిగిపోయాడు. బాలీవుడ్ స్టార్లతోనూ పరిచయం పెంచుకుని వారితో పాన్ ఇండియా రేంజ్ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు.

విజయ్ దేవరకొండపై రోజుకో కథనం వెలువడుతోంది. సిల్లీ వార్తలు పుట్టుకొస్తున్నాయి. లైగర్ డిజాస్టర్ తో జనగణమనను పక్కనపెట్టేశారు. విజయ్ దేవరకొండను బ్రహ్మాస్త్ర 2 కోసం అడుగుతున్నారనే క్రేజీ వార్తలు వస్తున్నాయి. రణ్ బీర్ కపూర్ నటించిన శివ పాత్రకు తండ్రి గా పాత్ర దేవ్. ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ నటులని సంప్రదించిన కరణ్ జోహార్.. చివరికి విజయ్ దేవరకొండని సంప్రదించాడంటూ సిల్లీ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Prabhas: అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ప్రభాస్ చేశాడా?

టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోలుగా, పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతున్నారు ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun). ఇద్దరిదీ వేర్వేరు నేపథ్యం అయినప్పటికీ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో తమ తడాఖా చూపిస్తున్నారు. ప్రభాస్ ఏకంగా ప్రస్తుతం అన్ని మూవీస్ పాన్ ఇండియా (PAN INDIA) లెవల్లోనే చేస్తూ దేశ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాడు. బాహుబలితో (Bahubali) ప్రభాస్ జాతకం పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అలాగే అల్లు అర్జున్ తాజాగా పుష్ప (Pushpa) సినిమాతో ఇంటర్నేషనల్ గా తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు.

వీరిద్దరూ కూడా చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య కాస్త పోటీ నడిచినట్లు తెలుస్తోంది. తొలుత వీరు చేయాలనుకున్న సినిమా కోసం ఓ దర్శకుడు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో కాస్త ఆలోచనలో పడ్డాడని సమాచారం. డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ.. ఈ వ్యవహారాన్ని తాజాగా బయట పెట్టారు. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ గురించే ఈ ముచ్చటంతా.

ఈశ్వర్ మూవీ వచ్చి ప్రస్తుతం 20 ఏళ్లు అవుతోంది. ప్రభాస్ కెరీర్ మొదలై కూడా రెండు దశాబ్దాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆ మూవీ విశేషాలు పంచుకున్నాడు దర్శకుడు జయంత్. మొదట ఈ మూవీకి మరో హీరోను అనుకున్నామని వెల్లడించాడు. అయితే కచ్చితంగా అల్లు అర్జున్ అని ప్రస్తావించలేదు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న కుర్ర హీరోను ఎంచుకుందాం అని అనుకున్నారట.

తర్వాత ప్రభాస్ అయితే కరెక్ట్ అని నిర్ధారించుకున్నారట. అనంతరం ఇలాంటి మాస్ కథకు ప్రభాస్ అయితేనే మంచిదని ఫిక్స్ అయ్యారట దర్శకుడు. ప్రభాస్ కు పూర్తి కథ చెప్పలేదని, కేవలం కొన్ని మెయిన్ పాయింట్లు వివరించామన్నాడు. పూర్తి నమ్మకంతో సినిమాలో నటించేందుకు ప్రభాస్ అంగీకరించాడని డైరెక్టర్ తెలిపాడు. మరోవైపు అల్లు అర్జున్ మొదట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనప్పుడు చాలా కథలను మిస్ చేసుకున్నడనే ప్రచారం కూడా ఉంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి మూవీతో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read Also : Ketika Sharma: రెడ్ డ్రెస్ లో కేతిక.. చూపు తిప్పుకోలేని అందాలతో..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles