Adipurush First Day Collections: శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 వేల థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు అత్యంత ఉత్సాహంగా, జై శ్రీరామ్ నినాదాలతో అభిమానులు థియేటర్లకు క్యూకట్టారు. యానిమేషన్‌పై నమ్మకం, ప్రభాస్ నటనపై విశ్వాసం ఉంచి ఈ మూవీకి వెళ్లారు అభిమానులు. దర్శకుడు ఓంరౌత్.. మొదటిసారి ట్రైలర్ విడుదలయ్యాక అక్షింతలు పడ్డ నేపథ్యంలో.. తర్వాతి రెండు సార్లు ట్రైలర్స్, పాటల విడుదల సందర్భంగా కాస్తంత కేర్ తీసుకున్నారు. ఫైనల్ ట్రైలర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అభిమానులు గంపెడాశలు పెట్టుకొని మూవీ చూశారు. ప్రభాస్ నటనకు వందకు వంద మార్కులు వేయొచ్చు. గ్రాఫిక్స్, కొన్ని సీన్లు మినహా చిత్రం విజయవంతం అయ్యిందని చాలా మంది అభిమానులు చెబుతున్న మాట. ట్రేడ్ వర్గాలు ఊహించినట్లుగానే ఆదిపురుష్ తొలిరోజు (Adipurush First Day Collections) మాంచి జోష్ వచ్చింది. ఈ మూవీ వసూళ్ల విషయంలోనూ మెరిసింది. అంచనాలను మించిన కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు సుమారు 140 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మేరకు మేకర్స్ కూడా ప్రకటించడంతో అభిమానులకు సంతోషం రెట్టింపవుతోంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా మూవీ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా సినిమా తీశారని అభిమానులు మెచ్చుకుంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సంగతి చూస్తే.. ఆదిపురుష్ మూవీకి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. నైజాంలో ఏకంగా 13 కోట్ల 68 లక్షల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ తరహా వసూళ్లు ఇంతకుముందెన్నడూ లేవని, ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఇక ఆదిపురుష్ మూవీ ఆంధ్రాలో తొలిరోజు సుమారు 19 కోట్ల బిజినెస్ సాధించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రభాస్ మూవీకి సుమారు 32 కోట్లకు పైచిలుకు వసూళ్లు వచ్చాయని సమాచారం.
ఆదిపురుష్ సినిమా బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లు సాధించింది. నార్త్ బెల్ట్‌లో సుమారు 32 కోట్ల నెట్ వసూలైందని తెలుస్తోంది. మరోవైపు విదేశాల్లోనూ ఆదిపురుష్ జోష్ కొనసాగింది. మూవీ హవాతో తొలి రోజే ప్రీమియర్స్‌తో కలుపుకొని 1.5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయిందని తెలుస్తోంది. బాహుబలి తర్వాత ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ స్టార్‌డమ్, సత్తా మరోసారి చాటినట్లయింది. ఇందుకు మొదటి రోజు వసూలైన కలెక్షన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బాహుబలి చిత్రం తొలిరోజే వంద కోట్లు కలెక్షన్ సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు సాహో చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి రోజు ఆ మూవీ సైతం వంద కోట్ల వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. ఏకంగా 140 కోట్లు రాబట్టడం ప్రభాస్ స్టామినాను మరోసారి చాటినట్లయింది. ఇక మొదటి రోజే వంద కోట్ల రూపాయలపైబడి కలెక్షన్లు సాధించిన దక్షిణాది తొలి స్టార్ ప్రభాస్ మాత్రమే కావడం విశేషం. ఆదిపురుష్ యానిమేషన్, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కారణంగా ఆదిపురుష్ మూవీకి తొలి నుంచి విపరీతమైన అంచనాలు, హైప్ ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దర్శకుడు ఓమ్‌రౌత్ కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమైంది.
బుకింగ్స్‌లోనూ మొదటిరోజు భారీ స్థాయిలో స్క్రీన్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. అత్యధిక స్థాయిలో స్క్రీన్లు కూడా కేటాయించడం ప్లస్ పాయింట్ అయ్యింది. ఈ కారణంగానే వసూళ్లు భారీగా వచ్చాయి. ఆదిపురుష్ మూవీ సుమారు 500 కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Read Also : Adipurush First Talk: గ్రేట్ న్యూస్.. ఆదిపురుష్ ఫస్ట్ టాక్ సూపర్ హిట్.. జై శ్రీరామ్!