Adipurush First Talk: అభిమానులకు గుడ్ న్యూస్. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా తన ప్రస్థానాన్ని పరిచయం చేసిన అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా జూన్ 16న విడుదల అవుతోంది. ఆదిపురుష్ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రభాస్.. ఆధ్యాత్మిక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇదే తొలిసారి. (Adipurush First Talk)
ఆదిపురుష్ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ వేయి కళ్లతో జైశ్రీరామ్ పాటలు వింటూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌ను బట్టి మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఫైనల్ ట్రైలర్ అభిమానుల ప్రశంసలందుకుంది. ట్రైలర్‌లోనే ప్రభాస్ గ్రాఫిక్స్, డైలాగులు కూడా అత్యంత అద్భుతంగా ఉండటంతో ఇక పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ చిత్రంపై మొదట ట్రోల్స్ చేసిన వాళ్లే ఇప్పుడు ప్రమోట్ చేస్తూ జైశ్రీరామ్ పేరును తలచుకుంటున్నారు.
ఆదిపురుష్ సినిమా ఫైనల్ ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు హీరో ప్రభాస్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారట. వస్తున్న రెస్పాన్స్ అలా ఉంది మరి. తమ కథానాయకుడు సాక్షాత్తూ శ్రీరామచంద్రుడిలా ఈ తరానికి సరిగ్గా సరిపోయేటట్లుగా ఉన్నాడంటూ అభిమానులు కితాబిస్తున్నారు. ఒకరకంగా శ్రీరామచంద్రుడి సినిమా అంటే మన తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో అందరికీ చిరస్థాయిలో గుర్తుండిపోతారు.
ఆ తర్వాత అంతటి స్థాయిలో ఇప్పుడు ప్రభాస్ మూవీ ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రభాస్ ఈ తరహా మూవీలో నటించడం తొలిసారి కావడంతో అందరికీ ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ సినిమాని ఇప్పటి వరకు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ నే ఊహించుకునేవారు. ఇప్పుడు ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు.
ఆదిపురుష్ పాటలకు కూడా చాలా మంచి స్పందన వస్తోంది. అన్ని పాటలూ రిపీటెడ్‌గా వింటూ మైమరచిపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా జై శ్రీరామ్ అనే పాట వినడానికి చాలా బాగుందని, పొడవు జుట్టు తో ఉన్న ప్రభాస్ ను చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు అని అభిమానులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాఖ్యానం చాలా స్లోగా అనిపించిందని, అయితే ఇది రామాయణం కాబట్టి అలాంటివి ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు చాలా వరకు రివ్యూ రిపోర్ట్స్ పాజిటివ్ గానే వస్తుండడంతో పాజిటివ్ వైబ్స్ పెరిగిపోతున్నాయి.
ఫస్ట్ టాక్ పాజిటివ్ వస్తే ఇంకేముందీ.. మూవీ బంపర్ హిట్ అందుకున్నట్టే లెక్క. ఆదిపురుషుడి కథ కాకుండా మిగతా ఎలిమెంట్స్ పై ఎక్కువ ఫోకస్ ఉండడంతో సినిమా ఎలా ఉంటుందో అనే ఆత్రుత నెలకొంది. ఓవరాల్‌గా ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. సినిమా కనుక బాహుబలి రేంజ్ లో ప్రేక్షకులకు నచ్చితే బాక్సాఫీస్ వద్ద ప్రబాస్ తన స్థాయేంటో మరోసారి నిరూపించినట్లవుతుందని అభిమానులు చెబుతున్నారు. ప్రభాస్ రేంజ్ వేరే లెవల్ అంటూ సందడి చేస్తున్నారు. బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ జోష్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also : Adipurush Pre Release Event: తిరుపతిలో జై శ్రీరామ్.. వేలాదిగా తరలి వచ్చిన ప్రభాస్ అభిమానులు