Gold rates today 10-08-2023: బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఇండియాలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.110, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 చొప్పున తగ్గాయి. మరోవైపు వెండి ధర రూ.500 తగ్గింది. యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా కోసం మదుపర్లు ఎదురుచూస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పట్టు కోల్పోతోంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,951 డాలర్ల వద్ద ఉంది. (Gold rates today 10-08-2023)
తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..
తెలంగాణలోని హైదరాబాద్ గోల్డ్ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,950గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,950 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.73,500 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.54,950 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.59,950 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.73,500 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.55,300 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,330 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.
దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.54,950గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.59,950 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.55,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,110 గా నమోదైంది. జైపూర్, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.
మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.350 తగ్గింది. రూ.23,670 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.
Read Also : Asthma Treatment: ఆస్తమాకు ఆయుర్వేదంలో చికిత్స.. ఉపశమనం లభిస్తుందిలా..!