Asthma Treatment: ఆస్తమాకు ఆయుర్వేదంలో చికిత్స.. ఉపశమనం లభిస్తుందిలా..!

Asthma Treatment: ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు శ్వాస మార్గం సన్నగా మారిపోతుంది. ఊపిరితిత్తుల్లో కఫం కూడా పేరుకుపోతుంది. దీని వల్ల గాలి సరిగ్గా ఆడకపోవడం లాంటి సమస్య విపరీతమవుతుంది. ఆస్తమా రోగులు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఆస్తమా రోగులకు బయట గాలిలోని దుమ్ము కూడా ఇబ్బంది పెడుతుంది. వాతావరణంలోని మార్పులను ఇలాంటి వారు అస్సలు తట్టుకోలేరు. ఇక ఆస్తమాకు ఆయుర్వేదంలో ప్రత్యేక చికిత్సలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. (Asthma Treatment)

ఆస్తమా రోగులు అంటేనే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఊపిరి ఆగిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. చేపలు సముద్రం నుంచి ఒడ్డున పడితే ఎలా గిలగిలా కొట్టుకుంటాయో ఆస్తమా రోగులు కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటూ ఉంటారు. ఊపిరి కోసం పోరాడాల్సి వస్తుంది. ఊపిరి పీల్చుకోలేక ఆయాసపడుతూ ఉంటారు. కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించడం ద్వారా వీరికి ఉపశమనం కలుగుతుంది.

ఆస్తమా రోగులు తీసుకొనే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి ఎలాంటి ఆహారం పడదో తెలుసుకొని వాటిని అవాయిడ్‌ చేయాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉచ్వాస నిస్వాసలకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. ఆస్తమా తీవ్రమైనప్పుడు వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాతిపై గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో కాపడం చేయాలి. యూకలిప్టస్‌ తైలాన్ని నీటిలో కలిపి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల వెంటనే కాస్త ఉపశమనం లభిస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

ఆస్తమా రోగులు వాము, బెల్లం కలిపి తీసుకోవాలి. మెత్తగా దంచిన వాము చూర్ణాన్ని ఓ గ్లాసు మజ్జికలో కలిపి తాగితే కఫం పల్చగా మారిపోతుంది. ఇక అల్లం కూడా ఆస్తమా రోగులకు మంచి ఔషధంగా చెబుతారు. రోజూ తినే కూరల్లో అల్లం యాడ్‌ చేసుకోవాలి. పరగడుపున ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో బ్రింగ్‌రాజ్‌ అనేది చాలా బాగా పని చేస్తుందంటున్నారు. దీన్ని కషాయంగా కాచి ఉదయం, సాయంత్రం 30 ఎంఎల్‌ చొప్పున తీసుకోవాలని సూచిస్తున్నారు. మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, పసుపు సమపాళ్లలో తీసుకొని ఉదయం, సాయంత్రం ఓ స్పూన్‌ తేనెలో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.

Read Also: Healthy Food Tips: హీరోయిన్‌లా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ ఆహారం ట్రై చేయండి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles