Gold Price today 29 July 2023: బంగారం ధర ఒకరోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ దోబూచులాడుతోంది. ఇండియాలో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.380, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 చొప్పున తగ్గింది. మరోవైపు వెండి ధర అమాంతం రూ.2000 దిగొచ్చింది. యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,961 డాలర్ల వద్ద ఉంది. (Gold Price today 29 July 2023)
తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..
తెలంగాణలోని హైదరాబాద్ గోల్డ్ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,100గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,110 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.79,500 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.55,100 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.60,110 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.79,500 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.55,500 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,550 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.
దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.55,100గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.60,110 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.55,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,260 గా నమోదైంది. జైపూర్, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.
మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర ఇవాళ భారీగా తగ్గింది. ఏకంగా రూ.70 తగ్గింది. రూ.24,720 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.
Read Also : Tirumala Samacharam 29-07-2023: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు