HomeAndhra PradeshTenali Crime News: తెనాలిలో బాధిత యువతి పరిస్థితి విషమం

Tenali Crime News: తెనాలిలో బాధిత యువతి పరిస్థితి విషమం

Tenali Crime News: తెనాలిలో తెలుగుదేశం పార్టీకి చెందిన రౌడీషీటర్ నవీన్ చేతిలో గాయపడిన యువతి పరిస్థితి (Tenali Crime News) విషమంగా ఉంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. నవీన్ తో పాటు మరో ఇద్దరు యువకులు యువతిని చిత్రహింసలకు గురి చేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.

యువతి ఒంటిపైన కమిలిన గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పారు. సహనను చిత్రహింసలకు గురిచేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రౌడీ షీటర్ నవీన్ పోలీసుల వద్ద లొంగిపోయాడు.

కేసు నీరుగార్చి, రౌడీ షీటర్ ను కాపాడటానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ బాధిత యువతి తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తమ కుమార్తెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

తెనాలి అయితానగర్‌కు చెందిన 26 ఏళ్ల యువతి ఓ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ థెరపీ సెంటర్‌లో పని చేసేది. ఈనెల 19న సాయంత్రం విధులకు వెళ్లిన బాధితురాలిని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రాగి నవీన్‌ తన పుట్టిన రోజు అని నమ్మించి వెంట తీసుకువెళ్లాడు. కొద్ది గంటల తర్వాత తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని తెనాలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయాడు.

అనంతరం అక్కడికి చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్‌ సహా పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేదు. ఈనెల 20న ఉదయం తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు గుంటూరు జీజీహెచ్ కు పంపారు. వెంటిలేటర్‌పై ఉన్న బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

గత ఎన్నికల్లో పెమ్మసాని చంద్రశేఖర్ తరఫున ప్రచారంలో నవీన్ యాక్టివ్ గా పాల్గొన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: AP Crime News: కాశీబుగ్గలో ఇద్దరు బాలికలపై అత్యాచారం!
Vizianagaram Crime: గుర్లలో డయేరియా మృతులు ఎంతమంది? ప్రభుత్వం ఏమందంటే..
Andhra Crime: ఇప్పటికైనా దిశ చట్టాన్ని అమలు చేయాలి
Badvel Crime: విద్యార్థిని హత్య నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
AP Crime News: బద్వేలులో విద్యార్థినిపై అఘాయిత్యం అనాగరిక చర్య

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు