Tirumala Samacharam 22-07-2023: తిరుమల శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్ వెలుపలకు వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 71,721 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32.078. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు చేకూరిందని అధికార వర్గాలు తెలిపాయి. (Tirumala Samacharam 22-07-2023)
25న తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల
శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్ నెలల కోటాను ఈనెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. అదనపు కోటా కింద 4,000 టికెట్లను విడుదల చేయనున్నారు. అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించి రోజుకు 15,000 టికెట్ల చొప్పున విడుదల చేయనున్నారు. ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు అక్టోబర్ మాసానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్‌కు సంబంధించిన వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Read Also : AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత
ఈనెల 26వ తేదీన మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని టీటీడీ పల్లవోత్సవం నిర్వహించనుంది. సహస్రదీపాలంకార సేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు కలిసి స్వామి, అమ్మవార్లకు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక హారతి ఇస్తారని టీటీడీ తెలిపింది.
నేడు తిరుపతిలో గవర్నర్ జస్టిస్ అబ్ధుల నజీర్ పర్యటన
తిరుపతిలో నేడు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటించనున్నారు. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం ఇవాళ జరగనుంది. స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొంటారు. 366 మందికి డిగ్రీలు, 35 బంగారు, ఇద్దరికి రజిత పతకాలు ప్రదానం చేయనున్నారు.