AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై చాలా కాలంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదు. తాజాగా ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. (AP High court)
పార్లమెంటు సాక్షిగా ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందని కేంద్రం వెల్లడించింది. 2019 జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని తెలిపింది. ఏపీ హైకోర్టు తరలింపు పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ దగ్గర పెండింగ్ లో లేదని కేంద్రం స్పష్టం చేసింది.
హైకోర్టు తరలింపు గురించి ఏపీ ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీని పై పూర్తి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాల్సి ఉందని వెల్లడించింది. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ రాతక పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Read Also : AP Cabinet Meeting: అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ కేబినెట్‌లో నిర్ణయాలు..