Tirumala Samacharam 05-09-2023: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. తిరులగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వస్తున్న వారికి సర్వదర్శం కోసం 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,555 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారికి 33,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు చేకూరిందని టీటీడీ తెలిపింది. (Tirumala Samacharam 05-09-2023)
నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరగనుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలకమండలి చర్చించనుంది.
Read Also : Registrations AP: గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ అధికారాలు