Tirumala Samacharam 04-09-2023: కలియుగ వైకుంఠం శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,459 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారీ హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు చేకూరిందని టీటీడీ వెల్లడించింది. (Tirumala Samacharam 04-09-2023)
నూతనంగా నిర్మించిన కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన
తిరుపతిలో నూతనంగా నిర్మించిన కచ్చపి ఆడిటోరియంను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. రూ. 41 కోట్లతో నూతనంగా కచ్చపి ఆడిటోరియం నిర్మాణం జరిగింది. కళాక్షేత్రానికి కచ్చపి అని పేరు పెట్టడం వెనుక ఒక చరిత్ర ఉందని భూమన తెలిపారు. సరస్వతీ దేవి వీణలో తీగ పేరు కచ్చపి అని భూమన వివరించారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్ల తో మరో తిరుపతిని అభివృద్ధి చేసి చూపించామంటూ భూమన వెల్లడించారు. భక్తితో పాటు సాహిత్యం సంగీతం కార్యక్రమాలతో కచ్చపి కళాక్షేత్రం కళకళలాడుతూ ఉండాలని టీటీడీ చైర్మన్ ఆకాంక్షించారు.