Chandrayaan 3 Update: చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలివిడత ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన చేసింది. అప్పగించిన పనులను ప్రజ్ఞాన్ విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో వెల్లడించింది. రోవర్ ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్ లోకి పంపినట్లు ఇస్రో ప్రకటించింది. డేటాను పంపే పేలోడ్ పనులను ఇస్రో నిలిపివేసింది. ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ పూర్తిగా రీఛార్జ్ అయిందని ఇస్రో పేర్కొంది. (Chandrayaan 3 Update)
మళ్లీ సూర్యోదయానికి సోలార్ ప్యానెల్ ను ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉంచారు. ఈనెల 22న చంద్రుడిపై సూర్యోదయం కావొచ్చని ఇస్రో అంచనా వేస్తోంది. మరికొన్ని రోజులు ప్రజ్ఞాన్ పరిశోధనలు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు రోవర్ సేకరించిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
చంద్రుడిపై 100 మీటర్ల జర్నీ పూర్తి చేసుకున్న ప్రజ్ఞాన్ రోవర్.. ప్రస్తుతం నిద్రకు ఉపక్రమించింది. రోవర్లోని పేలోడ్లను ఆఫ్ చేసి, రిసీవర్ను మాత్రమే ఆన్ చేసి ఉంచామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై శివశక్తి పాయింట్ వద్ద ఉన్న ల్యాండర్ నుంచి అది గరిష్టంగా 500 మీటర్ల దూరం వెళ్లగలదని ఇస్రో తెలిపింది.
అయితే, చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభమై 14 రోజులు కొనసాగనుండటంతో రోవర్ ను శనివారం సేఫ్ గా ఒక చోట పార్కింగ్ చేసింది ఇస్రో. తర్వాత స్లీప్ మోడ్ లోకి పంపింది. రోవర్ లోని పేలోడ్లను ఆఫ్ చేసి, రిసీవర్ ను మాత్రం ఆన్ చేసి ఉంచామని ఇస్రో వెల్లడించింది. ఈ నెల 22న అక్కడ పగలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు రోవర్ తిరిగి తన పని మొదలు పెడుతుందని ఇస్రో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Read Also : Aditya L1: నేడు ఆదిత్య-ఎల్1 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో