బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Agriculture, Andhra Pradesh

Andhra Pradesh : శనగ రైతులకు అండ‌గా ఉంటాం : మంత్రి అచ్చెన్నాయుడు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 18 అక్టోబర్ 2025

Andhra Pradesh : రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతు అభ్యున్నతే మా లక్ష్యం. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి అన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని, ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుంది.

అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయకంగా మారాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్ర‌బాబు ప్రత్యేక దిశానిర్దేశాలు ఇచ్చారు. రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Gadikota: ఉచిత పంటల బీమాకు చంద్రబాబు సర్కార్ మంగళం
Tomato Farmers : టమోటా రైతులకు అండగా ఉంటాం: అచ్చెన్న
Urea : పారదర్శకంగా యూరియా సరఫరా : అచ్చెన్నాయుడు

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading