మంగళవారం, 15 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan tweet on DSC: ఒక టీచర్‌ పోస్టు.. డీఎస్సీలో ఆరు మలుపులు! సీఎం చంద్రబాబును నిలదీసిన YS జగన్‌

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 14 సెప్టెంబర్ 2026

YS Jagan tweet on DSC: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్‌ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని YSRCP అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్‌ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్‌ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన

అభ్యర్థికి 65 టెట్‌ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని జగన్‌ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు.

రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన

అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు జగన్‌ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. “ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?” అన్నది టీచర్‌ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.

మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా?

తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు జగన్‌ ట్వీట్‌లో ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని కోరారు.

నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్‌ 77 మార్కులు

తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్‌లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని జగన్‌ తెలిపారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు డీఈవో ముందుగా అనర్హుడని ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు.

ఐదో మలుపు: ఎస్‌జీటీ పోస్టుకు ‘రాంగ్‌ పేపర్‌’?

77 మార్కులు పేపర్‌–II-Bలో వచ్చినవిగా చెబుతున్నారని జగన్‌ పేర్కొన్నారు. అది స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్‌ కాగా, ఎస్‌జీటీ పోస్టుకు పేపర్‌–I-A అవసరమని ట్వీట్‌లో వాదించారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.

ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్‌ ఎందుకు?

ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్‌ రాసినట్లు జగన్‌ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్‌జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, మరోసారి టెట్‌కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

చంద్రబాబు సమాధానం చెప్పాలి

ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిల‌దీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్‌ పేపర్‌, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Read also: YS Jagan PC on DSC: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ! తవ్వేకొద్దీ అక్రమాలు.. అడుగడుగునా నకిలీ సర్టిఫికెట్లు: YS జగన్‌ 
YS Jagan Padayatra: వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి పాదయాత్ర: వైఎస్‌ జగన్‌

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading