HomeAndhra PradeshUrea : పారదర్శకంగా యూరియా సరఫరా : అచ్చెన్నాయుడు

Urea : పారదర్శకంగా యూరియా సరఫరా : అచ్చెన్నాయుడు

Urea : రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా, పంపిణీని ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తోందని వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనంత యూరియా సమయానికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామ‌ని అన్నారు. (Urea)

రాష్ట్ర‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, ఎక్కడా కొరత తలెత్తకుండా తగినన్ని నిల్వలు సిద్ధం చేశామ‌ని, ఏవైనా అవకతవకలు లేకుండా రైతులకు నేరుగా యూరియా చేరేలా కఠిన చర్యలు చేపడుతున్నామ‌ని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యమ‌ని, యూరియా సరఫరాలో అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తూ, ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా సమృద్ధిగా లభ్యమవుతుందని, త‌ప్పుడు క‌థ‌నాలు, మాటలు న‌మ్మోద్ద‌ని సూచించారు.

యూరియా సరఫరా లో గత వైసిపి ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు పంపిణీ చేశామ‌ని మంత్రి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించామనే వార్త పూర్తిగా అవాస్తవమ‌ని అన్నారు. గత ప్రభుత్వం లో మార్క్ ఫెడ్ ద్వారా సొసైటీలకు ఎరువుల సరఫరా నిర్వీర్యం చేస్తే కూట‌మి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను గాడిలో పెట్టి సొసైటీలకు అధిక మొత్తంలో యూరియా సరఫరా చేసి గ్రామీణ రైతాంగానికి అందుబాటులో ఉంచిన విషయం గుర్తించాలని తెలిపారు.

గతానికి భిన్నంగా మార్క్ ఫెడ్
ప్రైవేట్ పంపిణీ నిష్పతి ని 50 : 50 నుండి 70:30 పెంచామ‌ని, మార్కె ఫెడ్ ద్వారా (ఆర్ ఎస్ కే, పీఏసీఎస్) 20% ఎక్కువ‌గా యూరియాను పంపిణీ చేసిన ఘ‌న‌త కూట‌మి ప్ర‌భుత్వానిది ద‌క్కుతుంద‌న్నారు. 2021- 22 నుండి 2023 – 24 వరకు గత వైసిపి మూడు సంవత్సరాల సరాసరి యూరియా సరఫరా కేవలం 1,55,617 మెట్రిక్ టన్నులు కాగా ఈ ఒక్క సంవత్సరం(2025- 26)లో ఆగస్టు చివరి నాటికి 2,04,096 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసామని అన్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా సరఫరా 31% శాతం గతం కంటే ఎక్కువ అని తెలిపారు. ఏ ఒక్క రైతుకు యూరియా అందని పరిస్థితి రాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షఅని, రైతు శ్రేయస్సు కూటమి ప్రభుత్వం ల‌క్ష్యం అని అన్నారు.

విజిలెన్స్ రెవెన్యూ అధికారుల నిరంతర నిఘా, క్రమం తప్పని తనిఖీల ద్వారా అందుబాటు ధరలోనే మార్కెట్ లో యూరియా ల‌భిస్తుంద‌ని, ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేదని స్ప‌ష్టం చేశారు. ఎటువంటి రాద్దాంతం చేయకుండా క్రమశిక్షణతో వరుసగా లైన్ లో సాగుతూ ఎరువులను తీసుకుంటున్న రైతులను మెచ్చుకుంటూ వాడుక భాషలో అందరికి అర్థమయ్యే విధంగా బఫె మాదిరిగా అన్న పదానికి వక్రభాష్యం పలకటం వైసీపీ వారి చౌక బారుతనానికి నిదర్శనని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్రత్యేక చొరవ చూపించి ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపడం ద్వారా మన రాష్ట్రానికి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇత‌ర రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇప్పటివరకు గత ఏడాది కన్నా 87,880 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ పంటలకు రాష్ట్ర రైతాంగం వినియోగించింద‌న్నారు. రాష్ట్రంలో యూరియా సరఫరా, పంపిణీ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని, ఎక్కడ నిరసనలు లేవని ,వాటిని అణిచివేసే ధోరణి ఉత్పన్నం కాదని ఈ ప్రభుత్వం అటువంటి అణిచివేత పనులు చేయదని తేల్చిచెప్పారు.

నల్లబర్లీ పొగాకు ,కోకో ,తోతాపురి మామిడి ,ఉల్లి ధరల విషయాలలో ఆ పంటలకు మద్దతు ధర లేకపోయినా సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో వాటిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిన విషయాన్ని గోవర్ధన్ రెడ్డి గుర్తించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఈ-కేవైసీ పూర్త‌యిన రైతుల‌కు అన్నదాత సుఖీభవ న‌గ‌దు జ‌మ‌
అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అంద‌చేసేందుకు తొలి విడ‌త‌గా ఇప్ప‌టికే 7 వేల రూపాయ‌ల‌ను రైతుల‌కు జ‌మ చేసామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగి ఉండి కూడా ఈ పథకం లబ్ది పొందని రైతుల కోసం ఆగష్టు 3 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ పోర్టల్ లోని గ్రీవెన్స్ మోడ్యూల్ అందుబాటులో ఉంచడం జరిగిందని, సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంట్ లు రైతుల ఫిర్యాదులు పోర్టల్ లో ప‌రిచార‌ని తెలిపారు.

ఈ ఫిర్యాదులన్నింటిని అన్నదాత సుఖీభవ మార్గదర్శకాల ప్రకారం అర్హతా ప్రామాణికాలతో రాష్ట్ర స్థాయిలో ధ్రువీకరణ చేయగా 36,722 మంది అర్హులు గా గుర్తించామ‌ని తెలిపారు. అర్హులయ్యుండి e –KYC లేక , రైతుల బ్యాంకు అకౌంట్ కి NPCI ACTIVATION లేని కారణంగా కొంతమంది రైతులకు ఈ పథకం లబ్ది అందలేదని, అలాంటి రైతులలో ప్రస్తుతం e-KYC చేయించుకున్న వారికి అలాగే NPCI ACTIVATION చేయించుకున్న వారికి, ఫిర్యాదుల ధృవీకరణలో అర్హతపొందిన రైతులతో కలిపి మొత్తం 47,161 మందికి సెప్టెంబర్ 4వ తేదీన మొదటి విడత లబ్ది రూ. 5000/- రూపాయ‌ల‌ చొప్పున మొత్తం 23.58 కోట్లు విడుదల చేయడం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఇవీ చదవండి: Crops in AP : మామిడి, పొగాకు, ఆక్వాపై కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు